Begin typing your search above and press return to search.

నూడిల్స్ నోరూరిస్తున్నాయి పిల్లా..!

హీరోయిన్ గా రాణించాలంటే అందం, నటన వస్తే చాలదు. కూసింత అదృష్టం కూడా ఉండాలి

By:  Tupaki Desk   |   24 Aug 2023 12:06 PM GMT
నూడిల్స్ నోరూరిస్తున్నాయి పిల్లా..!
X

హీరోయిన్ గా రాణించాలంటే అందం, నటన వస్తే చాలదు. కూసింత అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లభించేక పాపం యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ ఇంకా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దక్ష చూడటానికి చాలా అందంగా ఉంటుంది. యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. కానీ, ఇప్పటివరకు చెప్పుకో దగిన మంచి హిట్ మాత్రం పడలేదనే చెప్పాలి.


తొలిసారి హోరాహోరీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియకపోవడంతో దక్షకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఆ తర్వాత హుషారు అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ క్లిక్ అయినా, దక్షకు పెద్దగా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.

జాంబిరెడ్డి, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయినా, దక్ష కెరీర్ కి ఉపయోగపడేలేదు. రవితేజ రావణాసురలో అవకాశం వచ్చింది కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఆఫర్లు రాలేదు. కానీ, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేయడంలో ముందుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది.


తాజాగా, నూడిల్స్ తింటూ ఓ ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో థైస్ కనిపించేలా కూర్చొని,ప్లేట్ లో నూడిల్స్ పెట్టుకొని వాటిని తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఓ వైపు నూడిల్స్ తింటూనే, మరోవైపు ఓరగా చూడటం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా, దక్ష సినిమాల కంటే, బంగర్రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్యను చూసి కన్ను కొట్టడంతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ వీడియో ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో, చైతూకీ, దక్ష కి సమ్ థింగ్, సమ్ థింగ్ ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, వాటిని ఆమె తిరస్కరించడం విశేషం. బంగార్రాజు మూవీలో ఓ పాటలో నటించిందనే విషయం తెలిసిందే.