Begin typing your search above and press return to search.

తన సీక్రెట్స్ అన్ని ఆ స్టార్ హీరోకే చెబుతుందట..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అందం అభినయం రెండిటిలో ఆమెకు ఆమే సాటి అనేలా అదరగొట్టేస్తుంది అమ్మడు

By:  Tupaki Desk   |   24 Oct 2023 3:56 AM GMT
తన సీక్రెట్స్ అన్ని ఆ స్టార్ హీరోకే చెబుతుందట..!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అందం అభినయం రెండిటిలో ఆమెకు ఆమే సాటి అనేలా అదరగొట్టేస్తుంది అమ్మడు. బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ సత్తా చాటుతున్న దీపికా మధ్యలో హాలీవుడ్ సీరీస్ లతో కూడా అలరించింది. ప్రియాంక తర్వాత బాలీవుడ్ హాలీవుడ్ లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది దీపిక మాత్రమే. అయితే ఇన్నాళ్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన దీపిక కల్కి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ సరసన దీపికా అదరగొట్టేందుకు రెడీ అవుతుంది.


స్టార్ హీరోయిన్ గా ఉంటూనే రణ్ వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన దీపికా వారి పర్సనల్ లైఫ్ కూడా సాఫీగా కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు దీపిక. తనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టమని.. అందుకే క్రీడాకారిణిలా ఓటమిని కూడా హుందాగా స్వీకరిస్తానని అన్నారు. తనకంటే గొప్పగా నటించే వాళ్లు కూడా చాలా మంది ఉండొచ్చని ఎందులో అయినా కూడా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు దీపిక.

అంతేకాదు తను ఎక్కువగా మాట్లాడలేనని.. నలుగురిలోకి వెళ్లాలంటే ముడుచుకుపోతానని అన్నారు. తన ప్రపంచంలో ఒకరో ఇద్దరో ఉంటారని.. ఇంట్లో విషయాలు షూటింగ్ టైం లో మాట్లాడనని అన్నారు. సినిమాల విషయాలను కేవ్లం రణ్ వీర్ తో మాత్రమే షేర్ చేసుకుంటానని చెప్పారు దీపిక. ఇక తన పర్సనల్ విషయాలను కూడా చెప్పే చనువు స్నేహం ఒక్క షారుఖ్ తో మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు. షారుఖ్ నటించిన ఓం శాంతి ఓం సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీపిక. అందుకే అతనంటే స్పెషల్ అంటుంది అమ్మడు.

సెలబ్రిటీస్ అన్నాక ట్రోలింగ్స్ కామన్. తనపై వచ్చే ట్రోల్స్ ని అసలు పట్టించుకోనని అన్నారు దీపిక. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని తనపై వచ్చే ఎలాంటి కామెంట్స్ ని పట్టించుకునే టైం లేదని అన్నారు. ప్రభాస్ కల్కితో తెలుగు తెరకు పరిచయం అవుతున్న దీపికా ఇక్కడ కూడా వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు టాలీవుడ్ బాట పడుతున్న ఈ టైం లో దీపికాకు కల్కి తర్వాత కూడా వరుస ఆఫర్లు వస్తాయని చెప్పొచ్చు.