బంజారా బ్యూటీలా మెరిసిపోతున్న డింపుల్...!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటి వరకు వరసగా అవకాశాలు అయితే, అందుకుంది
By: Tupaki Desk | 22 Sep 2023 6:43 AM GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటి వరకు వరసగా అవకాశాలు అయితే, అందుకుంది. కానీ, అవేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గ్లామర్ విషయంలోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోదు. అయినా కూడా పాపం, అనుకున్నంత సక్సెస్ కాలేకపోతోంది.
తన మదటి సినిమా ఖిలాడీలోనే రెండు రకాల వేరియేషన్స్ చూపించి షాక్ ఇచ్చింది. పద్దతిగా లంగా వోణీలో కనిపించి మురిపించింది. సెకండ్ హాఫ్ లో హాట్ డ్రెస్సులు వేసి కూడా మైమరిపించింది . ఆ మూవీ కనుక క్లిక్ అయ్యి ఉంటే, అమ్మడి కెరీర్ మరోలా ఉండేది. కానీ, అది డిజాస్టర్ కావడం ఈ బ్యూటీ కెరీర్ కి దెబ్బేసింది.
ఈ సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బంజారా డ్రెస్ లో కనిపించింది. బంజారా లెహంగా డ్రెస్ లో , మత్తెక్కించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
తన నడుము అందాలను చూపిస్తూ, కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక, డింపుల్ ఫిట్నెస్ విషయంలోనూ ఎక్కువ ఫోకస్ గా ఉంటుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంత కష్టపడుతుంది కాబట్టే, ఇంత హాట్ గా, ఫిట్ గా కనపడుతుంది.
డింపుల్ చివరగా, గోపీచంద్ తో కలిసి రామబాణం మూవీలో నటించింది. అయితే, ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇదిలా ఉండగా, ఇటీవల డింపుల్ ఓ వివాదం లో ఇరుక్కుంది. రీసెంట్‌గా ఆమె ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌లో ఓ ఐపీయస్ ఆఫీసర్‌తో పార్కింగ్ వివాదం నెలకొంది. ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అయితే డింపుల్ ఆ వివాదంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. హైకోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం.