బుల్లి గౌనులో సెగలు రేపుతున్న దిశా
బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. ఆమె పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా, తెలుగువారికి కూడా సుపరిచితమే
By: Tupaki Desk | 21 Sep 2023 7:02 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. ఆమె పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా, తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో నూ ఓ సినిమా చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది దిశా పటానీ. ఆ మూవీలో ఓ పాటలో చాలా గ్లామరస్ గా కనిపించింది. ఆ మూవీలోనే ఆమె అందాలకు అందరూ ఫిదా అయ్యారు. కానీ, ఆ తర్వాత మళ్లీ ఆమె తెలుగులో నటించింది లేదు.
అయితే, బాలీవుడ్ లో మాత్రం వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సినిమాల కంటే కూడా, సోషల్ మీడియా ద్వారానే దిశా అందరికీ పరిచయం. ఎందుకంటే ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో అదరగొడుతూ ఉంటుంది. ముఖ్యంగా లో దుస్తుల ప్రకటనలు చేస్తూ, ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాల్లోనూ, బయట కూడా ఎప్పుడూ పొట్టి దుస్తుల్లోనే కనపడుతూ ఉంటుంది.
తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. డెనిమ్ జీన్స్ క్లాత్ లాంటి పొట్టి మ్యాక్సీ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో తన అందాలతో పాటు, చుట్టూ ఉన్న అందాలను కూడా చూపించింది. కళ్లకు కళ్లజోడుతో చాలా స్టైలిష్ గా కనపడుతోంది. ఆ కళ్లజోడు కూడా లెన్స్ కార్ట్ యాడ్ లో భాగంగా పెట్టుకోవడం విశేషం. దాని బ్రాండింగ్ కోసమే, ఈ బ్యూటీ ఇప్పుడు ఈ ఫోటోలు దిగడం గమనార్హం.
ఇప్పుడు, ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక, దిశ గ్లామర్ షో కోసమే సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. కేవలం ఇన్ స్టాగ్రామ్ లో దగ్గరదగ్గరగా 6మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, కెరీర్ విషయానికి వస్తే, తెలుగులో లోఫర్ లో మాత్రమే నటించింది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ లో ఆయన లవర్ ప్రాతలో కూడా కొద్ది సేపు మెరిసింది.
అంతేకాకుండా, ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.