Begin typing your search above and press return to search.

దివి స్టన్నింగ్ లుక్.. వావ్ అనాల్సిందే..

తెలుగు పిల్ల, బిగ్ బాస్ అందం దివికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   31 July 2024 9:37 AM GMT
దివి స్టన్నింగ్ లుక్.. వావ్ అనాల్సిందే..
X

తెలుగు పిల్ల, బిగ్ బాస్ అందం దివికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత స్లోగా సినిమా అవకాశాలు అందుకుంది. మహేష్ బాబు మహర్షి తోపాటు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీల్లో మెరిసింది దివి. అయితే మహర్షి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అప్పుడే బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్క్ కొట్టేసింది.

బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతీరుతో అందరినీ మెప్పించింది. టైటిల్ విన్ అవ్వకపోయనా.. మనసులు గెలుచుకుంది. తెలుగు వారికి బాగా దగ్గరైంది. దీంతో అమ్మడు హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుస అవకాశాలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో సందడి చేసింది. జగపతి బాబు రుద్రాంగితో పాటు క్యాబ్ స్టోరీస్, నయూమ్ డైరీస్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వంటి వివిధ వెబ్ సిరీసుల్లో నటించి ఆకట్టుకుంది బిగ్ బాస్ బ్యూటీ దివి.

ఇటీవల లంబసింగి మూవీతో హీరోయిన్ గా మారింది అమ్మడు. సినిమా రిజల్ట్ పక్కనపెడితే తన యాక్టింగ్ తో అలరించింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ లో దివి మెరిసింది. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న NBK 109 ప్రాజెక్ట్ లో మంచి స్కోప్ ఉన్న రోల్ లో దివి యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా దివి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటోంది. శారీలతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో పిక్స్ దిగి పోస్ట్ చేస్తుంటోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి ఫిదా చేస్తుంటోంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ ను ఎక్కువగా షేర్ చేస్తుంటోంది. వెకేషన్స్ అండ్ స్పెషల్ ప్లేసెస్ లో ఫోటోలు దిగి నెట్టింట పంచుకుంటూ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది.

తాజాగా దివి షేర్ చేసిన కొత్త పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బ్లూ అండ్ వైట్ మినీ డ్రెస్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. అందులో ఆమె ఫిజిక్ చూసి అంతా ఫ్లాట్ అయిపోతున్నారు. పిక్స్ సూపర్ అని నెటిజన్లు చెబుతున్నారు. లైక్స్ కొడుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. జిమ్ లో గట్టి గానే వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. మొత్తానికి దివి మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుందన్నమాట. మరి దివి కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.