కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానన్న టాప్ మోడల్ కం నటి
'జన్నత్ 2'తో బాలీవుడ్ లో ప్రవేశించిన టాప్ మోడల్ కం నటి ఈషా గుప్తా.. ఇటీవల పరిశ్రమలో రెండుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవడంపై ఓపెనైంది
By: Tupaki Desk | 1 Oct 2023 3:15 AM GMT'జన్నత్ 2'తో బాలీవుడ్ లో ప్రవేశించిన టాప్ మోడల్ కం నటి ఈషా గుప్తా.. ఇటీవల పరిశ్రమలో రెండుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవడంపై ఓపెనైంది. ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2007 విజేతగా ఇషాజీ అందాల పోటీల్లో యువతరానికి ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. ఇప్పుడు నటనారంగంలో తనకు ఎదురైన భయంకరమైన సంఘటనలను ఆమె వెల్లడించింది. ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 37 ఏళ్ల ఇషా గుప్తా వృత్తిపరమైన అవకాశాలకు బదులుగా ఒక చిత్రనిర్మాత తనను లైంగిక ప్రయోజనాల కోసం ఎలా ప్రతిపాదించాడో వివరించింది. ఇది మాత్రమే కాదు.. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తనను సినీరంగంలో వేధించడం ఎదుర్కోవడాన్ని అంగీకరించలేకపోయానని తెలిపింది. ''సినీరంగంలో ఇద్దరు వ్యక్తులు ఈ పరీక్షకు గురిచేశారు'' అని తెలిపింది.
చాలా మంది బాలీవుడ్ నటీమణులు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కు గురవుతున్నారనే విషయాన్ని కూడా ఈషా గుప్తా తాజాగా అంగీకరించింది. తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేస్తూ .. నటరంగంలో వృత్తిపరమైన అవకాశాలకు బదులుగా ఒక చిత్రనిర్మాత తనను లైంగిక ప్రయోజనాల కోసం ప్రతిపాదించాడని తెలిపింది. తాను కాస్టింగ్ కౌచ్‌ను ఒకసారి కాదు రెండుసార్లు ఎదుర్కొన్నానని వెల్లడించింది. నాటి భయంకరమైన సంఘటనను వివరిస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన మొదటి సంఘటన గురించి మాట్లాడింది. అయితే ఆ అవకాశాన్ని తిరస్కరించానని తెలిపింది. ఈ సంఘటన గురించి మరింత వివరంగా మాట్లాడుతూ.. అప్పటికే సినిమా చిత్రీకరణ సగం పూర్తయిందని చెప్పారు. నన్ను ఎంపిక చేసుకున్నారు. కానీ కాస్టింగ్ కౌచ్ ని ప్రతిఘటించడంతో, సహ నిర్మాత తనకు సినిమాలో అవకాశం ఇవ్వొద్దు అని మేకర్స్‌కి చెప్పాడు. సెట్‌లో తన ఉనికిని కూడా వారు ప్రశ్నించారని ఆమె తెలిపింది. దీని తర్వాత కొందరు దర్శకనిర్మాతలు ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి నిరాకరించినట్టు వెల్లడించింది. ''నేను ఏం చేయను.. ఏం చేయగలను.. కాబట్టి నన్ను సినిమాలోకి తీసుకోకపోవడానికి కారణాలు తెలుసుకున్నాను'' అని తెలిపింది.
రెండవ సంఘటనపై మాట్లాడుతూ- ఈషా గుప్తా తాను అవుట్‌డోర్ ఫిల్మ్ షూట్‌లో ఉన్నానని, అప్పుడు కూడా మళ్లీ అలాంటి సన్నివేశమే ఎదురైందని వెల్లడించింది. దుర్భరమైన సంఘటనను వివరిస్తూ ''ఇద్దరు వ్యక్తులు కాస్టింగ్ కౌచ్ ఉచ్చును వేశారు. నాకు అర్థమైంది.. కానీ వారి వైపు నుంచి చిన్న ఎత్తుగడ వల్ల సినిమా ఇంకా చేశాను. ఔట్ డోర్ షూటింగ్ సమయంలో నేను అతని ట్రాప్ లో పడతానని అనుకున్నాడు. నేను కూడా తెలివిగా ఉన్నాను.. నేను ఒంటరిగా నిద్రపోను అని చెప్పాను. నేను నా గదిలో పడుకోమని నా మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిచాను'' అని తెలిపింది. అలాంటి వ్యక్తులు స్టార్ల పిల్లలతో ఈ పనులు చేయలేరు.. పేరెంట్ చంపేస్తారని భయపడతారు! అని ఇషాజీ అన్నారు. వారి మానసిక దోపిడీ చర్యల గురించి మాట్లాడుతూ...మనకు పని అవసరమైతే మనం ఏదైనా చేయడానికి సిద్ధమవుతామని వారు భావిస్తారు! అని ఆవేదన చెందారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఈషా గుప్తా చివరిగా ప్రకాష్ ఝా 'ఆశ్రమ్ 3'లో నటించారు. బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించగా, ఇషా గుప్తా కీలక పాత్రలో నటించారు. దీనికి ముందు ఆమె 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్'లో కనిపించింది. తర్వాత 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరి 3'లో కనిపించనుంది. ఇషా గుప్తా జన్నత్ 2తో తన నటనను ప్రారంభించింది. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది. రాజ్ 3డి, రుస్తోమ్, బాద్షాహో, చక్రవ్యూహ్ వంటి చిత్రాలలోను అద్భుత నటనతో ఆకట్టుకుంది.