Begin typing your search above and press return to search.

నంబర్ 1 హీరోయిన్.. ఇప్పటికే అదే అందంతో..!

హీరోయిన్ గా చేస్తున్నప్పుడు కూడా చేయని గ్లామర్ షోని ఇప్పుడు ఫోటో షూట్స్ రూపంలో ఫాలోవర్స్ కోసం చేస్తుంది.

By:  Tupaki Desk   |   20 July 2024 5:31 AM GMT
నంబర్ 1 హీరోయిన్.. ఇప్పటికే అదే అందంతో..!
X

తెలుగులో నిన్నటితరం భామల్లో క్రేజీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అమ్మడు గజాల. నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన ది బెస్ట్ పెయిర్ గా పాపులారిటీ సంపాదించింది అమ్మడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో కెరీర్ సూపర్ జోష్ అందుకుంది.

ఐతే ఎన్టీఆర్ లాంటి సినిమాతో నటించాక అమ్మడికి స్టార్ ఆఫర్లు వస్తాయని అనుకోగా యువ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2001 నుంచి 2005 వరకు నాలుగేళ్లలోనే 12 తెలుగు సినిమాలు 3 తమిళ సినిమాల్లో నటించింది గజాల. అమ్మడి అప్పటి స్పీడ్ చూస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ కెరీర్ మీద పడింది. అలా అమ్మడి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2005 లో శ్రావణమాసం సినిమాలో నటించి అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు దక్కించుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కన్నడలో ఒకటి మలయాళంలో రెండు సినిమాలు చేసింది గజాల.

2011లో మనీ మనీ మోర్ మనీ తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించింది అమ్మడు. ఐతే అప్పటికే కెరీర్ లో పూర్తిగా వెనుకబడిన గజాలా ఆ తర్వాత మరో సినిమాలో కనబడలేదు. ఐతే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమ్మడు డిప్రెషన్ లోకి వెళ్లిదన్న టాక్ ఉంది. ఐతే లేటెస్ట్ గా గజాల సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన లేటెస్ట్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

గజాలా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ గా చేస్తున్నప్పుడు కూడా చేయని గ్లామర్ షోని ఇప్పుడు ఫోటో షూట్స్ రూపంలో ఫాలోవర్స్ కోసం చేస్తుంది. స్టూడెంట్ నంబర్ 1 హీరోయిన్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న గజాలా ఇప్పటి ఫోటోలు చూస్తే అమ్మడిలో గ్లామర్ అలానే ఉందని అనిపిస్తుంది. కొద్దిగా ట్రై చేస్తే చాలు కానీ ఇప్పటికీ గజాలా సినిమాల్లో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలైన గజాలా ఇప్పటికీ అంతే అందంతో సర్ ప్రైజ్ చేస్తుంది.