Begin typing your search above and press return to search.

అందంతో టెంపరేచర్ పెంచేస్తోన్న గాయత్రి

నార్త్ ఇండియా నుంచి చాలా మంది ముద్దుగుమ్మ హీరోయిన్స్ గా అడుగుపెడుతూ ఉంటారు. వీరిలో సక్సెస్ అందుకునేది కొంతమందే

By:  Tupaki Desk   |   9 Oct 2023 8:02 AM GMT
అందంతో టెంపరేచర్ పెంచేస్తోన్న గాయత్రి
X

నార్త్ ఇండియా నుంచి చాలా మంది ముద్దుగుమ్మ హీరోయిన్స్ గా అడుగుపెడుతూ ఉంటారు. వీరిలో సక్సెస్ అందుకునేది కొంతమందే. మోడలింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలో తెలుగులోకి అడుగుపెడుతున్నారు.


అందులో ఒకరు కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ ఒకరు. ఇప్పటికే ఈ బ్యూటీ సింగర్ గా, యాక్టర్ గా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. టైగర్ నాగేశ్వరరావుతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మరో హాట్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. హిందీలో ఇట్టు సై బాత్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మూడు వెబ్ సిరీస్ లలో కూడా ఈ బ్యూటీ నటించింది. దాంతో పాటు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో తెలుగులోకి డెబ్యూ చేస్తోంది. నిజానికి పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీతోనే ఈమె హీరోయిన్ గా ఇంటరి ఇవ్వాల్సి ఉంది. అయితే ఎందుకనో కొంత షూట్ చేసిన తర్వాత గాయత్రి స్థానంలో కేతిక శర్మ వచ్చి చేరింది.

అయితే టైగర్ నాగేశ్వరరావుతో సినిమాపై ఈ అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. సినిమాలతో పెద్దగా పాపులారిటీ రాకున్న సోషల్ మీడియాలో గ్లామర్ షోతో గాయత్రి భరద్వాజ్ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. హాట్ హాట్ అందాలతో ఏ మాత్రం తగ్గకుండా ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతాయి.

తాజాగా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో కూడా ఫుల్ హాట్ షోతో గాయత్రి గ్లామర్ గా కనిపించింది. ఎద అందాలతో ఈ అమ్మడు కుర్రాళ్ళకి హీట్ పెంచేస్తోంది. సుతిమెత్తని నవ్వుతో అబ్బాయిలని యిట్టె ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు మూవీ సక్సెస్ అయితే గాయత్రి రూపంలో మరో హాట్ హీరోయిన్ టాలీవుడ్ కి దొరికినట్లే.