Begin typing your search above and press return to search.

బికినీలో తెలుగమ్మాయి.. వేరే లెవెల్ లో స్కిన్ షో..

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. తెలుగులో పెళ్లిచూపులు టీవీ షోతో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:34 AM GMT
బికినీలో తెలుగమ్మాయి.. వేరే లెవెల్ లో స్కిన్ షో..
X

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. తెలుగులో పెళ్లిచూపులు టీవీ షోతో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. దీంతో సినిమాల్లో మెల్లగా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. అదే సమయంలో యాంకర్ ప్రదీప్ లీడ్ చేసిన పెళ్లి చూపులు షోలో పాల్గొని తన అందచందాలతో అలరించింది.

14 మంది అమ్మాయిలు పాల్గొన్న ఆ షోలో జ్ఞానేశ్వరి టైటిల్‌ ను సొంతం చేసుకుంది. అయితే షోలో గెలిచిన వారితో ప్రదీప్‌ కు పెళ్లి చూపులు జరుగుతాయని నిర్వాహకులు అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత పెళ్లి చూపులు జరిగాయని కూడా జ్ఞానేశ్వరి చెప్పింది. కానీ ఇప్పటివరకు మళ్లీ ఇద్దరు కలిసి కనిపించలేదు. దీంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఈజీగా అర్థమైపోయింది. ఇక షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది జ్ఞానేశ్వరి. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటోంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. మిర్రర్ సెల్ఫీలు పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తోంది. హీటు పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది జ్ఞానేశ్వరి.

ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న జ్ఞానేశ్వరి.. తాజాగా మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది. బీచ్ లో బోట్ పై విహరిస్తున్నట్టుగా కనిపించింది. బ్లూ అండ్ ఎల్లో బికినీలో స్కిన్ షోతో ఫిదా చేసింది. క్యాప్ పెట్టుకుని కర్లీ హెయిర్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఆమె పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి స్కిన్ షోకు ఫ్లాట్ అయ్యామని చెబుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తూ.. కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు నెటిజన్లు.

అయితే పెళ్లి చూపులు షోతో వచ్చిన ఫేమ్ తో చిన్న సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మిస్టర్ అండ్ మిస్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నీ జతగా, మాయలో, చక్రవ్యూహం వంటి వివిధ సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ లలో కూడా నటిస్తోంది. మరి వాటితో వైజాగ్ కు చెందిన ఈ అమ్మడు.. ఎలాంటి హిట్లు సంపాదించుకుంటుందో చూడాలి.