అత్త ఆమని పోలికలతో కోడలు తెరంగేట్రం
ఇండస్ట్రీలో బ్యాకప్ చూసుకుని తెరంగేట్రం చేసేది కొందరైతే ఎలాంటి బ్యాకప్ లేకుండా ఎంటర్ అయ్యేది మరికొంత మంది
By: Tupaki Desk | 20 Nov 2023 7:30 AM GMTఇండస్ట్రీలో బ్యాకప్ చూసుకుని తెరంగేట్రం చేసేది కొందరైతే ఎలాంటి బ్యాకప్ లేకుండా ఎంటర్ అయ్యేది మరికొంత మంది. ఎంట్రీ ఎలా జరిగినా ఆ తర్వాత ట్యాలెంట్ తోనే స్టార్ డమ్ సాధ్యం. బ్యాకప్ ఎంట్రీ కార్డు లాంటింది తప్ప! ఎంతటివారైనా ఆ తర్వాత సొంతంగా పైకెదగాల్సిందే. తాజాగా సౌండ్ పార్టీ అనే సినిమాతో హ్రితికా శ్రీనివాస్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇంతకీ ఈ భామ ఎవరో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
సైలెంట్ గా సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యే సరికి ఇండస్ట్రీలో తన బంధుత్వాల్ని రివీల్ చేస్తుంది. సీనియర్ నటి ఆమని తనకు స్వయనా అత్త అవుతుందని తెలిపింది. సరిగ్గా రిలీజ్ కి ముందు బంధుత్వాన్ని రివీల్ చేయడం విశేషం. ఆ సంగతులేంటో హ్రితక మాటల్లోనే.. 'సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి నెలకొంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను.' అల్లంత దూరాన' సినిమా తర్వాత హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో చిత్రం.
ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. స్టోరీ ఎంతో ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని నమ్మకం ఉందని' చెప్పుకొచ్చింది. ఇక హ్రితికాలో అత్త పోలికలు చాలా వరకూ మ్యాచ్ అవుతున్నాయి. ముక్కు..ముఖం..కళ్లు..పెదాలు అన్ని అత్త పీచర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయి.
ఆమనికి తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నటిగా తనకం టూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. ఆమని అత్త..అమ్మపాత్రలతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ చాలా పరిమితంగానే అవకాశాలు అందుకుంటున్నారు. హీరోయిన్ గా మెప్పించినంతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్దగా అవకాశాలు రావడం లేదు. మరి అత్తలా హ్రితక కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.