లెగ్ ఇన్ లో హ్యూమా ఖురేషీ మురిపిం!
బాలీవుడ్ లో హ్యూమా ఖురేషీ ది ప్రత్యేకమైన జర్నీ. ఎంత మంది నటీమణులున్నా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది
By: Tupaki Desk | 19 Nov 2023 4:30 PM GMTబాలీవుడ్ లో హ్యూమా ఖురేషీ ది ప్రత్యేకమైన జర్నీ. ఎంత మంది నటీమణులున్నా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ఏడాదికి ఒక సినిమా చేసినా? అందులో తన ప్రత్యేకతని చాటుతుంటుంది. బలమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించడం అమ్మడి ప్రత్యేకత. సన్నివేశానికి తగ్గట్టు సునాయాసంగా మౌల్డ్ అవుతుంది. నటన పరంగా ఎంతగా ఆకట్టుకుంటుందో? బోల్డ్ అటెంప్ట్ చేయాల్సి వస్తే అందులోనూ ప్రత్యేకతని చాటడం అమ్మడి స్పెషాల్టీ.
యువతలో ఫాలోయింగ్ రెట్టింపు అవ్వడానికి ప్రధాన కారణం ఈ లక్షణమే. ఎంతో మంది సీనియర్ బ్యూటీలున్నా! హ్యూమా తెరపై కనిపించిందంటే? కుర్రాళ్లలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతోనూ అంతే ఆకట్టుకుంటుంది. ఆన్ స్క్రీన్ తరహాలోనే ఆఫ్ ది స్క్రీన్ లోనూ అమ్మడు అంతకు మించి ట్రీట్ ఇస్తుంటుంది. డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ అప్పిరియన్స్ తో ఆకట్టుకుంటుంది.
తాజాగా హ్యూమా సిరీస్ నుంచి మరో న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిగో ఇక్కడిలా నలుపు వర్ణం డిజైన్ లో ఆల్ట్రా మోడ్రన్ గెటప్ లో అలరిస్తుంది. స్కిన్ టైట్ లెగ్ ఇన్ పై మ్యాచింగ్ నక్షత్రాల మెరుపుతో కూడిన బ్లాక్ కోట్ ధరించింది. ఇన్ సైడ్ గోధుమ వర్ణం పిట్ ధరించింది. ఇక హ్యూమా మ్యాకప్ లో ప్రత్యేకత ఎప్పటిలాగే మరోసారి సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది.
లైట్ మ్యాకప్.. అందమైన పెదాలపై స్కిన్ ని మ్యాచ్ చేసేలా పూసిన లిప్ స్టిక్ నేచుర్ పెదాల్ని తలపి స్తుంది. చెవులకు ఎంపిక చేసుకున్న డిజైన్డ్ చెవులీలు ముఖాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. హ్యూమా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక సినిమాల సంగతి చూస్తే ఇటీవలే రిలీజ్ అయిన 'తార్ల'తో మెప్పించింది. ప్రస్తుతం 'పూజా మేరీ జాన్ 'అనే చిత్రంలో నటిస్తోంది.