బ్లేజర్‌లో జూనియర్ కత్రిన కిల్లింగ్ లుక్
కత్రిన కైఫ్ సోదరి ఇసబెల్లా కైఫ్ పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు గంటోంది
By: Tupaki Desk | 14 March 2024 1:23 PM GMTకత్రిన కైఫ్ సోదరి ఇసబెల్లా కైఫ్ పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు గంటోంది. వరుస చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు వరుస ఫోటోషూట్లతోను హీట్ పెంచుతూనే ఉంది. తాజాగా బ్లూ బ్లేజర్ లో ఇసబెల్లా మెరుపులు మెరిపించింది. బ్లేజర్ లో ఇన్నర్ సొగసును ఆవిష్కరించేందుకు ఇసబెల్లా ఎంతమాత్రం వెనకాడలేదు. ఈ స్టన్నింగ్ ఫోటోషూట్ కోసం డబు రత్నానీ లాంటి ట్యాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ పని చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇప్పటికే మూడు నాలుగు చిత్రాల్లో నటించేసిన ఇసబెల్లా కైఫ్ తన వర్క్ లైఫ్ అనుభవాల గురించి ఇటీవల మాట్లాడింది. తనకు తన సోదరి కత్రిన రంగుల ప్రపంచంలో ఎలా ముందుకు సాగాలో మార్గనిర్ధేశనం చేసారని వెల్లడించింది. అందరినీ మెప్పించలేక పరధ్యానంలో పడకండి! అని తన సోదరి కత్రిన కైఫ్ సలహా ఇచ్చిందని కూడా ఇసబెల్లా కైఫ్ అన్నారు. టైమ్ టు డ్యాన్స్‌తో ఇటీవలే బాలీవుడ్‌లో తన నటనా రంగ ప్రవేశం చేసిన కొత్త నటి ఇసాబెల్లె కైఫ్. తన సోదరి, సీనియర్ నటి కత్రినా కైఫ్ కష్టపడి పని చేయమని..చేసే పనిపై దృష్టి కేంద్రీకరించమని సలహా ఇచ్చిందని చెప్పింది. దర్శకనిర్మాత-కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా వద్ద సీనియర్ సహాయకుడు స్టాన్లీ మెనినో డికోస్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సింగ్ ఈజ్ కింగ్, పార్టనర్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల సెట్స్‌లో కత్రినా కైఫ్‌ను కలిసేదానిని అని దానివల్లనే హిందీ చిత్ర పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై అవగాహన వచ్చిందని ఇసాబెల్లె కైఫ్ చెప్పారు. కత్రిన ఎప్పుడూ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మనం వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు అది ఎల్లప్పుడూ సహాయపడుతుంది. ప్రతి ఒక్కరినీ మెప్పించలేము గనుక ఎప్పుడూ ఏకాగ్రతతో ఉండాలి.. కష్టపడి పనిచేయాలి..సందర్భం ఏదైనా కానీ పరధ్యానంలో పడకండి! అని కత్రిన సలహా ఇచ్చినట్టు ఇసబెల్లా తెలిపారు.
నేను ఏం చేయబోతున్నాను అనే దాని గురించి నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు పరిశ్రమలోకి రావాలనే కోరిక ఉంది.. కానీ నేను నా పాఠశాల విద్యను ముగించవలసి వచ్చింది. తరువాత నేను కాలేజీకి వెళ్లి, ఆపై నటనలోకి వచ్చాను అని తెలిపింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాల్లో ఇసాబెల్లె కైఫ్ నటనారంగేట్రం చేస్తుందని చాలా కథనాలొచ్చాయి. అయితే ఆడిషన్ క్లియర్ అయిన తర్వాత ఒక డ్యాన్స్ డ్రామాలో పాత్రను పోషించే అవకాశం వరించిందని ఇసబెల్లా చెప్పారు. నేను సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. నిర్మాతలు నన్ను ఇష్టపడిన తర్వాత ఎంపికయ్యాను అని తెలిపింది. పరిశ్రమలో నటించడానికి ప్రయత్నించే ఎవరికైనా ఖాన్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని అంది.
నేను కొన్నాళ్లుగా సినిమాల కోసం ఆడిషన్ ఇస్తున్నాను. ఈసారి ప్రతిదీ సరిగ్గా జరిగింది. ఆడిషన్స్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది! అని ఇసబెల్లా చెప్పింది. బాలీవుడ్‌లోకి ప్రవేశించే ముందు తాను యుఎస్‌లో జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక సినిమా సెట్‌లో పనిచేశానని వెల్లడించింది. అమెరికాలోని యాక్టింగ్ స్కూల్ నుంచి చదువు ముగించుకుని సినిమాల్లో చేరేందుకు ఇండియా వచ్చాను అని కూడా తెలిపింది. కెమెరా వెనుక పని చేయడం వల్ల సినిమా మేకింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ గంటలు షూట్ చేయడం, షాట్ సెటప్ చేయడం, సినిమా కోసం ప్రిపరేషన్ చేయడం సెట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు అనుభూతి చెందుతారు.. అని తెలిపింది.
'టైమ్ టు డ్యాన్స్' తర్వాత 'సుస్వాగతం ఖుషామదీద్' అనే చిత్రంలోను ఇసబెల్లా నటించింది. ఇందులో ఫుక్రే స్టార్ పుల్కిత్ సామ్రాట్ కథానాయకుడిగా నటించారు.