ఖాన్లు కింగ్లను తలదన్నే సంపన్నురాలు
ఆమె అత్యంత సంపన్న నటి. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ అయినా కెరీర్లో లేదు. డజన్లకొద్దీ సినిమాల్లోను నటించింది లేదు.
By: Tupaki Desk | 15 Aug 2023 5:03 AM GMTఆమె అత్యంత సంపన్న నటి. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ అయినా కెరీర్లో లేదు. డజన్లకొద్దీ సినిమాల్లోను నటించింది లేదు. రెండు దశాబ్ధాల కెరీర్ లో ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ ఆమె ఆస్తులు బిలియన్ డాలర్లను మించి ఉన్నాయి. దాదాపు 3 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటిగా గుర్తింపు పొందారు జామీ గెర్ట్జ్. నిజానికి ఆమె పేరు హాలీవుడ్లో జూలియా రాబర్ట్స్, ఏంజెలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టన్ వంటి వ్యక్తుల వలె గుర్తించబడలేదు.
అయితే సినిమాల్లో నటించని జామీ అంత భారీ ఆదాయాన్ని ఎలా ఆర్జించింది? అంటే.. ఆమె గొప్ప ఎంట్ ప్రైన్యూర్. తన అదృష్టాన్ని ప్రధానంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరీక్షించుకుంది. అలాగే స్పోర్ట్స్ లోను జామీ పెట్టుబడులు పెట్టింది. NBA టీమ్ అట్లాంటా హాక్స్ యాజమానిగా కొనసాగింది. ప్రస్తుతం 57 సంవత్సరాల వయస్సులో ఉన్న జామీ నిజానికి బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. 1970లలో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది.
సినీ రంగప్రవేశం 1981లో `ఎండ్లెస్ లవ్`తో జరిగింది. ఆ తర్వాత ఆమె ట్విస్టర్-స్టిల్ స్టాండింగ్ -ది నైబర్స్ వంటి సినిమాలు టీవీ సిరీస్లలో కనిపించింది. అయితే 1990ల తర్వాత నెమ్మదిగా తెరమరుగైంది. 2022 లో విడుదలైన `ఐ వాంట్ యు బ్యాక్`లో అతిధి పాత్రలోను చివరిసారిగా నటించింది. ఇక నటిగా కంటే బిజినెస్ ఉమెన్ గా జామీకి దక్కిన అవార్డులు రివార్డులకు అంతూ దరీ లేదు.