గోల్డ్ డిజైన్ లో జాన్వీ జివ్వుమనిపిస్తోందే!
జాన్వీకపూర్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్..టాలీవుడ్ అంటూ రెండు భాషల్ని దున్నేస్తుంది
By: Tupaki Desk | 4 March 2024 7:18 AM GMTజాన్వీకపూర్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్..టాలీవుడ్ అంటూ రెండు భాషల్ని దున్నేస్తుంది. `దేవర` రిలీజ్ కాకుండానే తెలుగు నాట తనేంటో నిరూపిస్తుంది. మామ్ ఇమేజ్ తో అవకాశాలు దక్కించుకుంటుందా? తన ప్రతిభని గుర్తించి ఇస్తున్నారా? అన్నది తెలియదు గానీ జాన్వీ ఖాతాలో మాత్రం అన్నీ స్టార్ హీరోల చిత్రాలే కనిపిస్తున్నాయి. మామ్ ఇమేజ్ తోనే దక్కించుకుంటుంది? అన్నది ఓ సెక్షన్ ఆడియన్స్ అనుకుంటున్నా? అలా దక్కించుకోవడం అంత సులభమైన విషయం.
మామ్ బ్రాండింగ్ ఎంత తన మీద ప్రభావం చూపినా ట్యాలెంట్ లేకపోతే అవకాశాలివ్వరు. ఆ విషయంలో జాన్వీ ముందే అలెర్ట్ అయింది. బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవడంతోనే ఇక్కడా అవకాశాలు దక్కుతు న్నా యన్నది మరికొంత మంది వాదన. ఆ వాదనలు ఎలా ఉన్నా తెలుగు నాట ఆరంభమే పాన్ ఇండియా చిత్రాలు ఒడిసి పట్టుకోవడం అన్నది అన్నింటిని మించిన గొప్ప అవకాశం . ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కంటే గొప్ప లాంచింగ్ తెలుగులో నే దక్కింది అన్నది వాస్తవం.
హిందీలో `ధడక్` చేసిన సమయంలో అందులో హీరో కొత్తోడు. కానీ తెలుగులో తొలి సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ అందుకుంది. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న స్టార్ సరసన జాన్వీని ఎంపిక చేయడం అంటే గొప్ప విషయమే. ఆ సంగతి పక్కనబెడితే జాన్వీ ఫ్యాషన్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. నటిగా మ్యాకప్ వేసుకోవడానికి ముందే అమ్మడు నెట్టింట భారీ ఫాలోయింగ్ సంపాదించింది. తనదైన మార్క్ ఎంపికలతో సోషల్ మీడియాలో దూసుకుపోయింది.
నటి అయిన తర్వాత ఆ వేగం ఏ స్థాయికి చేరిందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అమ్మడు న్యూ డిజైన్ లో తళకులీని పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో అమ్మడు గోల్డ్ కలర్ పొడి డిజైన్ లో తళకు లీనింది. అమ్మడు స్కిన్ టోన్ డ్రెస్ లో కలిసిపోయింది. బ్యాక్ గ్రౌండ్ లోనే అదే కలర్ తో నిడిపోయింది. ఇంకే ముందు పిక్ అంతా గొల్డ్ మయం అయింది. ఈ సెషల్ జాన్వీ పూర్తిగా డ్రెస్ ఎలివేషన్ పైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.