టెలివిజన్ బ్యూటీ గ్లామర్ డోస్.. రెండు కళ్ళు సరిపోవేమో..
టెలివిజన్ ప్రపంచంలో కొంత మంది నటీమణులు తమ గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు
By: Tupaki Desk | 12 Aug 2024 4:30 PM GMTటెలివిజన్ ప్రపంచంలో కొంత మంది నటీమణులు తమ గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ లిస్ట్‌లో జ్యోతి రాయ్ కూడా ముందున్నా పేరు. టెలివిజన్ ప్రపంచంలో 'జగతి' పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన జ్యోతి రాయ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో సంచలనం సృష్టిస్తుంది.
జ్యోతి ఇటీవల సుకు పూర్వాజ్ అనే దర్శకుడితో ప్రేమ వివాహం చేసుకొని తన పేరును జ్యోతి పూర్వాజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. తన కొత్త పేరు, కొత్త లుక్‌తో ఆమె మరింత ఆకట్టుకుంటోంది. ఇటీవల, ఆమె మినీ డ్రెస్సులో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. టాటూ అందాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఈ కొత్త లుక్ లో ఆమె మరింత అందంగా మెరుస్తున్నట్లు పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జ్యోతి కెరీర్ విషయానికి వస్తే, 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తరువాత సోషల్ మీడియా ద్వారా యూత్‌ను ఆకర్షించింది. జ్యోతి, తన భర్త సుకు పూర్వాజ్‌తో కలిసి ప్రముఖ చిత్ర దర్శకుడు రూపొందిస్తున్న 'ఏ మాస్టర్ పీస్' చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రం విజయవంతమైతే, జ్యోతి కెరీర్‌కు కొత్త ఒరవడి తీసుకురావచ్చు. ప్రస్తుతం, ఆమె వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నా, తన గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. భవిష్యత్తులో హీరోయిన్గా స్థిరపడాలన్న లక్ష్యంతో ఈ సుందరి కృషి చేస్తోంది. మరి భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.