ఇప్పటికీ చందమామని వెంటాడుతోన్న మామ్!
కానీ కాజల్ గౌతమ్ కిచ్లూ పెళ్లాడినా..ఓ బిడ్డకు తల్లైనా కన్న తల్లినే వెనుక రమ్మంటుందిట. అమ్మడికి అమ్మను మంచి గొప్ప సహాయకురాలు ఉండరని అంటోంది.
By: Tupaki Desk | 18 Oct 2023 3:30 PM GMTఇండస్ట్రీకి కొత్తగా వచ్చే కొంత మంది హీరోయిన్ల వెనుక వాళ్ల తల్లులు కనిపిస్తుంటారు. హీరోయిన్ ఎక్కడికి వెళ్లినా వాళ్ల వెంటే ఉంటారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో మామ్ లు మాత్రం తప్పనిసరిగా వెంట ఉంటారు. ఉదయం షూటింగ్ మొదలైన దగ్గర నుంచి సాయంత్రం పూర్తయినా..రాత్రి అయినా సరే హీరోయిన్ డైరెక్టర్ కి కాల్షీట్లు కేటాయించినట్లు..తల్లులు కూతుళ్ల కోసం త్యాగం చేస్తుంటారు.
ఆ తల్లి వ్యక్తిగత ఖర్చు కూడా నిర్మాతే భరించాలి. ఇప్పటికీ కొంత మంది సీనియర్ హీరోయిన్ల వెనుక కూడా తల్లులు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ వెంట కూడా నిత్యం మామ్ ఉంటుందని మరోసారి తెలిపింది. కాజల్ హీరోయిన్ గా ప్రారంభమైన కొత్తలో ఆమెకి ఏమీ తెలియదని...ధైర్యం కోసం తోడుగా ఉంటుందనుకున్నారు. కానీ కాజల్ కి ఏ పనులు చేయాలన్నా! వెనుక కచ్చితంగా తల్లి ఉండాల్సిందేనట.
అయితే పెళ్లయిన తర్వాత కొంత మంది హీరోయిన్లు తల్లుల్ని వెంట తీసుకురారు. వ్యక్తిగత సిబ్బందిని నియమించుకుంటారు. కానీ కాజల్ గౌతమ్ కిచ్లూ పెళ్లాడినా..ఓ బిడ్డకు తల్లైనా కన్న తల్లినే వెనుక రమ్మంటుందిట. అమ్మడికి అమ్మను మంచి గొప్ప సహాయకురాలు ఉండరని అంటోంది.
కాజల్ కుమారుడు నీల్ బాధ్యతలు చూసుకోవడానికి కొంత మందిని నియమించిందిట. ఉదయం నుంచి పడుకునే వరకూ అన్ని రకాల జాగ్రత్తలు వాళ్లే తీసుకుంటారుట. వాళ్లకంటూ ఓ టైమ్ టేబుల్ వేసి ఇచ్చిందిట.
జీవితాన్ని..వృత్తిని వేర్వేరుగా చూసినప్పుడే ముందుకెళ్లగలం..లేకపోతే రెండు రకాలుగా వెనుకబడిపోతాం అంటుంది. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించలంటే కొన్ని కొన్నింటిని త్యాగం చేయాల్సిందే అంటోంది. సవాళ్లు ఎదురైనా ఇష్టపడి పనిచేస్తే కష్టంగా అనిపించవు. ప్రతీ తల్లి...జీవితాన్ని...వృత్తిని వేరుగా చూసినప్పుడే సక్సెస్ రేట్ బాగుటుంది అంటోంది. ప్రస్తుతం కాజల్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో 'భగవంత్ కేసరి' చేసింది. కమల్ హాసన్ తో 'ఇండియన్ -2' లో నటిస్తుంది. అలాగే 'సత్యభామ' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తోంది.