క్వీన్‌ని వెంటాడుతున్న గతం
కంగన నటించిన `చంద్రముఖి 2` వాణిజ్యపరంగా డిజాస్టర్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 26 Oct 2023 4:01 AM GMTకంగన నటించిన `చంద్రముఖి 2` వాణిజ్యపరంగా డిజాస్టర్‌గా నిలిచింది. సమీక్షలు అంతంత మాత్రమే. మణికర్ణిక తర్వాత తనకు ఇప్పటివరకూ అసలు సక్సెస్ లేదు. ధాకడ్ డిజాస్టర్ కాగా, తలైవి ఫ్లాప్‌గా మిగిలింది. కొన్ని వరుస పరాజయాల తర్వాత కంగన మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? అనేది అర్థం చేసుకోవడానికి `తేజస్` అడ్వాన్స్ బుకింగులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇంతకుముందు టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నా కానీ తేజస్ కి ప్రీబజ్ ఆశించినంత లేదు. హైప్ కూడా రాలేదు. ఫలితంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగులు తీసికట్టుగా ఉన్నాయని ట్రేడ్ చెబుతోంది. నేషనల్ చైన్ ఆఫ్ మల్టీప్లెక్స్ లైన PVR, INOX , సినిపోలిస్ లో ఇప్పటి వరకు 1000 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రం శుక్రవారం (27 అక్టోబర్) విడుదల కానుంది. ఈ సినిమా 2 కోట్ల నెట్ ఓపెనింగ్ సాధిస్తే అది అద్భుతమేనని విశ్లేషిస్తున్నారు.
మోదీని భగవంతుడు అని కీర్తిస్తున్న కంగన తన సినిమా తేజస్ ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. మంత్రులు, నాయకులతో కలిసి ఉన్న ఫోటోలను కూడా కంగన షేర్ చేస్తోంది. అయితే ఇవేవీ కంగన సినిమాకి కలిసి వస్తాయని అనుకోలేం. మంచి మౌత్ టాక్ ఏ సినిమాని అయినా నిలబెట్టే ఛాన్సుంటుంది. గత పరాభవాల దృష్ట్యా భారీ అడ్వాన్స్ బుకింగులు లేకపోవచ్చు. కానీ తేజస్ కి మంచి మౌత్ టాక్ వస్తే గనుక దానికనుగుణంగా సుదీర్ఘ కాలంలో సేవ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ అన్నివిధాలా సహకరిస్తుంది.