Begin typing your search above and press return to search.

బ‌న్నీకి నో చెప్పిన కావ్యక‌ళ్యాణ్ రామ్!

బ‌న్నీ నాతో న‌టిస్తావా? అని కావ్య‌క‌ళ్యాణ్ రామ్ ని అడిగితే ఏమందో తెలుసా? మ‌రో ఆలోచ‌న లేకుండా నో అనేసింది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 2:11 PM GMT
బ‌న్నీకి నో చెప్పిన కావ్యక‌ళ్యాణ్ రామ్!
X

బ‌న్నీ నాతో న‌టిస్తావా? అని కావ్య‌క‌ళ్యాణ్ రామ్ ని అడిగితే ఏమందో తెలుసా? మ‌రో ఆలోచ‌న లేకుండా నో అనేసింది. నేను మీతో న‌టించ‌డం ఏంటి? అని బిల్డ‌ప్ ఇచ్చింది. అవును అయితే ఇదంతా ఇప్పుడు జ‌రిగింది కాదు. కొన్నేళ్ల క్రితం కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న స‌మ‌యంలో ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. కావ్య బాల న‌టిగా చాలా సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. పెద్దాయ్యాక హీరోయిన్ గా అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నించినా ఆరంభంలో రాన‌ప్ప‌టికీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది.

అమ్మ‌డి ప్ర‌తిభ‌ని గుర్తించి అవ‌కాశాలు ఇస్తున్నారు. `బ‌లగం` సినిమాతో బాగా ఫేమ‌స్ అయింది. ఈ నేప‌థ్యంలో కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా పాల్గొంటుంది. మ‌రి అమ్మ‌డు నో ఎలా చెప్పిందో తెలుసా? ఆ వివ‌రాల్లోకి వెళ్తే..`డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు గారు ఓ ఫంక్ష‌న్ లో న‌న్ను చూసారుట‌. నా క‌ళ్లు ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో గంగోత్రిలో హీరోయిన్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించ‌మ‌న్నారు. అప్పుడు నాకు ఏ విష‌యాలు పెద్ద‌గా తెలియ‌దు. సినిమా షూటింగ్ కి ప్లే గ్రౌండ్ కి వెళ్లిన‌ట్లు వెళ్లేదాన్ని.

అలా మొద‌లైన ప్ర‌యాణం చాలా సినిమాల్లో న‌టించ‌గ‌లిగాను. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్‌.. పవన్‌ కళ్యాణ్‌.. అల్లు అర్జున్‌ లాంటి బిగ్‌స్టార్స్‌తో నటించే అవకాశం లభించింది. పెద్దాయ్యాక నాతో హీరోయిన్ గా న‌టిస్తావా? అని గంగోత్రి స‌మ‌యంలోనే బ‌న్నీ అడిగారు. అప్ప‌టికీ మీరంతా ముస‌లొళ్లు అయిపోతారు అన్నాను. నేను చేయ‌నని చెప్పాను. నేను పెద్ద‌య్యాను. కానీ ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉన్నారని` న‌వ్వేసింది.

ఈ భామ స్వ‌స్థ‌లం కొత్త‌గూడెం అట‌. కానీ పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. లా చ‌దివింది. న్యాయ‌వాదిగా స్థిర‌ప‌డాల‌నుకుంది. కానీ క‌రోనా అమ్మ‌డిలో మార్పులు తెచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో ప్ర‌య‌త్నిస్తే ఎలా ఉంటుద‌ని ఓ ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయిందిట‌. అయితే కెరీర్ గురించి ముందుగానే రాఘ‌వేంద్ర‌రావు తో చ‌ర్చించిందిట‌. కొన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కుల‌కు క‌ల‌కాలం గుర్తిండిపోయే పాత్ర‌లు చేయ్ అని స‌ల‌హా ఇచ్చారుట‌.