ఏక్ మినీ బ్యూటీ ఇలా విరుచుకుపడిందేంటి!
ప్లాప్ బ్యూటీలకు అవకాశాలు చాలా రేర్. సుడి ఉంటే తప్ప! మళ్లీ ఛాన్స్ అనేది కష్టమైన పని.
By: Tupaki Desk | 24 Sep 2023 12:30 PM GMTప్లాప్ బ్యూటీలకు అవకాశాలు చాలా రేర్. సుడి ఉంటే తప్ప! మళ్లీ ఛాన్స్ అనేది కష్టమైన పని. ఎన్నో అందాలొస్తుంటే! మళ్లీ ఫెయిలైన హీరోయిన్ ని తీసుకోవాలా? అన్న ఓ ఆలోచనకి మేకర్స్ వచ్చేస్తారు. దాన్ని బ్రేక్ చేసి అవకాశం అందుకోవాలంటే లక్ ఒక్కటే కలిసి రావాలి. తాజాగా కావ్య థాపర్ ని చూస్తే అదే అనిపిస్తుంది. `ఈ మాయ పేరేమిటో` అనే చిత్రంతో అమ్మడు ఐదేళ్ల కిత్రమే తెలుగు సినిమాకి పరిచయ మైంది.
ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. అటుపై రెండేళ్య గ్యాప్ అనంతరం `ఏక్ మినీ కథ`లో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో కాస్త గుర్తింపు దక్కింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో హిందీ..పంజాబీ..తమిళ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా అదే పరిస్థితి. ఇలా చూస్తుండగానే అమ్మడి పదేళ్ల జర్నీ పూర్తయింది. చేసిన సినిమాల సంఖ్య చూస్తే చాలా చిన్నది.
ఇలాంటి ట్రాక్ చూసి టాలీవుడ్ మళ్లీ అవకాశాలు ఇస్తుందా? అంటే ఎవరైనా `నో వే` అనే అంటారు. కానీ ఈ బ్యూటీ మాత్రం `ఎస్` ఇస్తుందని నిరూపించింది. అదీ చిన్నా చితకా చిత్రాలు కాదు..ఏకంగా స్టార్ హీరోలతోనే నటించే అరుదైన అవకాశాలు ఒడిసిపట్టుకుంది. ప్రస్తుతం రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో `డబుల్ ఇస్మార్ట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్ గా కావ్య థాపర్ ని ఎంపిక చేసారుట.
షూటింగ్ లో కూడా జాయిన్ అయినట్లు సమాచారం. ఇందులో అమ్మడు సెకెండ్ లీడ్ పోషిస్తుందని అంటున్నారు. లీడ్ ఏదైనా ఛాన్స్ అందుకోవడం అన్నది గొప్ప విషయం. అందులోనూ పూరి ఛాన్స్ ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు. హీరోయిన్ల విషయంలో ఆయన ఎంపిక చాలా సెలక్టివ్ గా ఉంటుంది. తాను పెట్టిన అన్ని టెస్టులు పాస్ అయితేనే తీసుకుంటాడు. ఆ లెక్కలో చూస్తే బ్యూటీ ట్యాలెంటెడ్ అనే అనాలి.
అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ ఈ బ్యూటీని మెయిన్ లీడ్ గా తీసుకున్నారుట. ఇలా అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ రుండు ఛాన్సులందుకుని మిగతా భామలకు సవాల్ విసిరింది. అవకాశాలకు విజయాలతో పనిలేదు ప్రతిభతోనే సాధ్యమని నిరూపించింది.