Begin typing your search above and press return to search.

లుక్కే కాదు రేటు కూడా టాప్ లేపేస్తుంది..!

తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రయోగాలకు కూడా పెద్ద పీట వేస్తుంది.

By:  Tupaki Desk   |   23 April 2024 12:30 AM GMT
లుక్కే కాదు రేటు కూడా టాప్ లేపేస్తుంది..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా అమ్మడికి ఛాలెంజింగ్ రోల్స్ లో చేయడమే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కెరీర్ లో తనని నిలబెట్టిన ప్రతి సినిమాలో కీర్తి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు సైతం అందుకున్న కీర్తి సురేష్ ప్రతి సినిమాకు తన మొదటి సినిమాలానే కష్టపడుతుంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రయోగాలకు కూడా పెద్ద పీట వేస్తుంది.

ఇక ఈ మధ్యనే బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా తన టాలెంట్ చూపించాలని అక్కడ అడుగు పెట్టిన కీర్తి సురేష్ అక్కడ కూడా రాణించాలని చూస్తుంది. సినిమాలే కాదు సినిమాల గ్యాప్ లో కీర్తి సురేష్ ఫోటో షూట్స్ తో కూడా ఆడియన్స్ ను అలరిస్తుంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ శారీ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది.

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ లో కీర్తి సురేష్ శారీలో కనిపించింది. ఆ తర్వాత అదే శారీ లుక్ తో కొన్ని ఫోటో షూట్స్ చేసింది. డిజైనర్ శారీగా కనిపిస్తుండగా అందులో కీర్తి సురేష్ ఎంతో ముద్దొస్తుంది. అంతేకాదు ఈ శారీ ధర కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ హడావిడి చేస్తుంది. శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ లో కీర్తి సురేష్ కట్టుకున్న శారీ అక్షరాల 2,99,000 రూపాయలని టాక్.

అంటే 3 లక్షల రూపాయల ఖరీదైన శారీలో కీర్తి సురేష్ దర్శనమిచ్చింది. తాను ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా అమ్మాయే కాబట్టి శారీలు, బ్యూటీ కేర్ ల మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 3 సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తెలుగులో రెండు సినిమాలకు నటించేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి.

లాస్ట్ ఇయర్ దసరాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన ఆ సినిమాలో వెన్నెల పాత్రలో మరోసారి తన సత్తా చాటగా చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో కూడా నటించింది. అయితే ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. తెలుగులో చేస్తే ఒక మళ్లీ ఒక సూపర్ హిట్ సినిమానే చేయాలని అనుకుంటుంది అమ్మడు అందుకే కాస్త టైం తీసుకుంటుందని చెప్పొచ్చు.