Begin typing your search above and press return to search.

కేతిక పాప.. పర్ఫెక్ట్ గ్లామర్ బ్యూటీ

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:36 AM GMT
కేతిక పాప.. పర్ఫెక్ట్ గ్లామర్ బ్యూటీ
X

టాలీవుడ్ లో రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు సొంతం చేసుకున్న అందాల భామ కేతిక శర్మ. ఈ అమ్మడు దురదృష్టం ఏంటో గాని హీరోయిన్ గా ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలు కూడా ఫ్లాప్ జాబితాలోకి వెళ్లిపోయాయి. స్టార్స్ తోనే చేసిన సక్సెస్ మాత్రం దొరకలేదు. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకుంటే ఇప్పుడు రేసులో వెనుకబడిపోయింది.


తాజాగా బ్రో మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. డిస్టిబ్యూటర్స్ కి లాస్ మిగిల్చింది. ఇందులో సాయి తేజ్ ప్రియురాలి పాత్రలో కేతిక శర్మ నటించింది. అయితే పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పాలి. సినిమా హడావిడి అయిపోవడంతో ఎంచక్కా కేతిక వెకేషన్ కి వెళ్ళిపోయింది.


ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతాయి. ఇన్ స్టాగ్రామ్ లో కేతిక శర్మకి ఉన్న ఫాలోయింగ్ కూడా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా కేతిక శర్మ ఫోటోలో ఉరల్ అవుతూ ఉంటాయి.