Begin typing your search above and press return to search.

కేతిక శర్మ.. చూపులతోనే చంపేసే అందం

ఈ బ్యూటీ మొదట పూరి జగన్నాధ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాలో నటించింది

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:15 AM GMT
కేతిక శర్మ.. చూపులతోనే చంపేసే అందం
X

ఇప్పుడున్న హీరోయిన్లలో మంచి గ్లామర్ తో ఆకట్టుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే కొంతమందికి అదృష్టం కలిసి రాకనో లేక సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేకనో తెలియదు కాని అస్సలు కెరీర్ ఒక ట్రాక్ లోకి రావడం లేదు. అలా చాలా కాలంగా స్టార్ హీరో హోదా కోసం పరితపిస్తున్న భామలతో కేతిక శర్మ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.


ఈ బ్యూటీ మొదట పూరి జగన్నాధ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాలో నటించింది. అందులో అమ్మడు గ్లామర్ తోనే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా బాగానే నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత నాగశౌర్య లక్ష్య అని మరొక సినిమా చేసింది. అది కూడా అంతగా వర్కౌట్ కాలేదు.


ఇక సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఈ బ్యూటీ ఏప్పటిలానే సోషల్ మీడియాలో మాత్రం తన ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటుంది. ఇక రీసెంట్గా అమ్మడు మరొకసారి ఘాటైన సొగసులతో కుర్రాళ్ళు మతిపోయేలా చేసింది.

అమ్మడు గతంలో కూడా హీటెక్కించే గ్లామర్ తో కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం చాలా సింపుల్ గా టీ షర్టులో కనిపించి అందంతో ఏదో మాయ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. కానీ ఈ విధంగా మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ సొగసులతో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇక గత ఏడాది కేతిక వైష్ణవ తేజ్ తో రంగా రంగా వైభవంగా అనే సినిమా చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించింది. కానీ అది కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం అయితే ఒక మీడియం రేంజ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమా అయినా అమ్మడికి కలిసి వస్తుందో లేదో చూడాలి.