Begin typing your search above and press return to search.

తెలుపు గౌనులో చైనా పీస్ లా ఉందే!

ఖుషీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి కొత్త ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి

By:  Tupaki Desk   |   27 Sep 2023 9:30 AM GMT
తెలుపు గౌనులో చైనా పీస్ లా ఉందే!
X

ఖుషీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి కొత్త ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. ప్రెండ్స్ గ్యాంగ్ తో పార్టీల‌కు వెళ్లినా! ప‌బ్ లు...వెకేష‌న్ ఎలాంటి స్పాట్ కెళ్లినా ఆ ఫోటోలు నెట్టింట దుమారం రేపుతుంటాయి. రేర్ గా అందాల ఆర‌బోత హైలైట్ అవుతుంది. చిట్టి పొట్టి దుస్తుల్లో ఖుషీ సెగ‌లు పుట్టించిన సంద‌ర్భాలెన్నో.


ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగానూ అగ్గిరాజేస్తుంది. తాను ఏం చేసినా సంథిగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవ్వాల‌ని చూస్తుంది. తాజాగా ఖుషీ క‌పూర్ కొత్త ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అమ్మ‌డు ముస్తాబైన విధానం చైనా పీస్ ని త‌ల‌పిస్తుంది. ఇదిగో ఇక్క‌డిలో తెలుపు గౌనులో స్టాండింగ్ ఫోజిష‌న్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఎలివేష‌న్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ముస్తాబైన విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

పొట్టి గౌను...కాళ్ల‌కు బ్లాక్ హైహీల్స్ ధరించింది. చేతిలో మ్యాచింగ్ చిన్న బ్లాక్ ప‌ర్స్ తో క‌నిపిస్తోంది. ముఖానికి మ్యాక‌ప్ ..పెదాల‌కి అద్దిన లిప్ స్టిక్...హెయిర్ స్టైల్ ప్ర‌తీది ఖుషీ క‌పూర్ ని వైవిథ్యంగా ప్ర‌జెంట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఓ అభిమాని చైనా పీస్ లా ఉందే! అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసాడు. ఇక క‌పూర్ వార‌సురాల్ని అభిమానించే వారి నుంచి అమ్మ‌డి కి లెక్క‌లెన‌న్ని ప్ర‌పోజ‌ల్స్ బాక్స్ లో వ‌చ్చిప‌డుతున్నాయి.

బాలీవుడ్ తెరంగేట్రానికి ముందే ఖుషీ ఇంత సంచ‌ల‌మైతే! లాంచ్ అయిన త‌ర్వాత అమ్మ‌డి వేగాన్ని త‌ట్టుకోగ‌ల‌మా? అన్న‌ది సందేహ‌మే. ది అర్చీస్ తో ఖుషీ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే సినిమాలో మ‌రికొంత మంది స్టార్ కిడ్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇంత‌మంది లాంచ్ అవ్వ‌డంతో! ప్ర‌త్యేకంగా ఏ ఒక్క‌ర్నీ హైలైట్ చేయ‌లేని స‌న్నివేశం క‌నిపిస్తోంది. సోలోగా ఎంట్రీ ఇస్తే త‌ప్ప‌! ఎవ‌రి స‌త్తా ఎంత అన్న‌ది ప‌ట్టుకోవ‌డం క‌ష్టం.