Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కియారా బంగారు అందం

ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   24 July 2024 4:52 AM GMT
పిక్ టాక్ : కియారా బంగారు అందం
X

ఎంఎస్ ధోని సినిమాలో సాక్షి పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు తెలుగు లో భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో కూడా నటించడం ద్వారా సౌత్ ప్రేక్షకులకు చేరువ అయిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు టాలీవుడ్‌ లో రామ్‌ చరణ్ కి జోడీగా గేమ్‌ ఛేంజర్‌ సినిమాను చేస్తూ ఉంది. మరో వైపు హిందీలో రెండు మూడు సినిమాలను కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

హీరోయిన్‌ గా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అందాల ఆరబోత ఫోటోలతో తన ఫాలోవర్స్ ని మరియు నెటిజన్స్ ని ముంచేస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరోసారి తన అందంతో అలరించింది.

ఆకట్టుకునే అందం కియారా సొంతం అంటూ ఈ బంగారు వర్ణం డ్రెస్ తో మళ్లీ నిరూపితం అయ్యింది. గోల్డెన్‌ ఔట్‌ ఫిట్‌ తో కియారా అద్వానీ ఆకట్టుకుంది. ఈ స్థాయి లో అందాల ఆరబోత చేయడం ఈ అమ్మడికే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్‌ చరణ్ కు జోడీగా ఈ అమ్మడు గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా మళ్లీ వీరి కాంబో గేమ్‌ ఛేంజర్ తో రాబోతుంది. ఈసారి కచ్చితంగా వీరిద్దరికి భారీ విజయం దక్కడం ఖాయం గా సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.