Begin typing your search above and press return to search.

ఇండియ‌న్స్ స్టోరీలో అంతా ఆమెరిక‌న్సే!

'ఇది భార‌తీయ క‌థ అయిన‌ప్ప‌టికీ ఈసినిమా కోసం ప‌నిచేస్తుంది అంతా అమెరిక‌న్సే. వారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది

By:  Tupaki Desk   |   20 Oct 2023 6:02 AM GMT
ఇండియ‌న్స్ స్టోరీలో అంతా ఆమెరిక‌న్సే!
X

బాలీవుడ్ న‌టి కుర్తి కీర్తి కుల్హారి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 'హ్యూమ‌న్'.. 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీస్'.. 'క్రిమిన‌ల్ జ‌స్టిస్'..'పింక్' లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి కీర్తి. ప‌లు హిందీ సిరిస్ ల్లోనూ అమ్మ‌డు న‌టించి ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ప్ర‌స్తుతం 'స‌చ్ ఈజ్ లైఫ్' అనే చిత్రంతో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫేమస్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అమెరికా నుంచి వ‌ల‌స వ‌చ్చిన భార‌తీయ మున్షీ కుటుంబం జీవిత క‌థ ఆధారంగా దీన్ని తెరెక్కిస్తున్నారు.

డుసెన్ మ‌స్క్యుల‌ర్ డిస్ట్రోపీ అనే వ్యాధితో బాధ‌ప‌డుతోన్న మూడేళ్ల కుమారుడికి మంచి జీవితాన్ని అందించాల‌న్న ఒక జంట చుట్టూ తిరిగే క‌త‌నంతో హ‌ర్ష్ మ‌హ‌దేశ్వ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. రెడ్ బైస‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రొమిలా సరాఫ్ భ‌ట్-రాహుల్ భ‌ట్ నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కీర్తి కుల్హారి సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

'ఇది భార‌తీయ క‌థ అయిన‌ప్ప‌టికీ ఈసినిమా కోసం ప‌నిచేస్తుంది అంతా అమెరిక‌న్సే. వారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఓ మంచి క‌థ‌లో న‌టిస్తున్నాను. ఇలాంటి పాత్ర‌లు చాలా అరుదుగా వ‌స్తాయి. వాస్త‌వ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఎమోష‌నల్ క‌నెక్ష‌న్ బాగుంటుంది. అలాంటి ఎమోష‌న్ ఇందులో కావాల్సినంత ఉంది' అన్నారు.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో సెట్స్ కి వెళ్ల‌నుంది.'క‌శ్మీర్..డిల్లీ.. న్యూ ఓర్లిన్స్..న్యూయార్క్ లో షూటింగ్ నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమెరికాలో ఉన్న కీర్తి కుల్హారి పాత్ర కోసం స‌న్న‌ధం అవుతుంది. డైసీ పాత్ర‌లో క‌నిపించ‌నున్న కీర్తి..డైసీని క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది. 'మొద‌టిసారి నిజ జీవితంలో న‌టిస్తున్నాను. ఇప్పుడా కుటుంబం అల్బానీలో ఉంది. డైసీని.. త‌న కుమారుడు స‌చిన్ మున్షీని క‌వ‌ల‌నున్నాం' అని తెలిపింది. 'రాకెట్ బాయ్స్' సిరీస్ లో న‌టించిన జిమ్ స‌ర్బ్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 'రాకెట్ బోయ్స్' లో జిమ్ న‌ట‌న‌కు గానూ ప్ర‌ఖ్యాత ఇంట‌ర్నేష‌న‌ల్ ఎమ్మి అవార్డుల్లో ఉత్తమ న‌టుడి గా అవార్డు అందుకున్నాడు.