Begin typing your search above and press return to search.

2024 మీదే బేబమ్మ ఆశలన్నీ..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ కృతి శెట్టి మొదటి సినిమా హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   25 Aug 2023 10:05 AM GMT
2024 మీదే బేబమ్మ ఆశలన్నీ..!
X

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ కృతి శెట్టి మొదటి సినిమా హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్నాళ్లు కెరీర్ సాగించే అవకాశం ఉందని అమ్మడు మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఉప్పెన సూపర్ హిట్ తో అరడజను పైగా సినిమాలు వరుస ఆఫర్లు రాగా వాటన్నిటినీ చేస్తూ వచ్చింది కృతి శెట్టి. అయితే కథల విషయంలో పెద్దగా ఫోకస్ చేయని కృతి శెట్టి ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా ఫ్లాపుల్లో పడిపోయింది.

లాస్ట్ ఇయర్ కృతి శెట్టి బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాల్లో నటించగా వాటిలో బంగార్రాజు మాత్రమే హిట్ అయ్యింది. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత నాగ చైతన్యతో మళ్లీ కస్టడీ ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి. ఈ ఇయర్ రిలీజైన ఆ సినిమా కూడా ఫెయిల్ అవడంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. అయినా సరే ఒకటి రెండు ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం మలయాళంలో టోవినో థామస్ హీరోగా చేస్తున్న అజేయంతే రంధం మోషనం సినిమాలో నటిస్తున్న కృతి శెట్టి ఆ సినిమాతో పాటుగా తమిళంలో జయం రవి హీరోగా చేస్తున్న జినీ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

తెలుగులో శర్వానంద్ శ్రీరాం ఆదిత్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గ నటిస్తుంది. 2023 లో కేవలం ఒకే ఒక్క సినిమా రిలీజ్ కాగా 2024 లోనే అమ్మడు చేస్తున్న సినిమాల రిలీజ్ లు ఉంటాయని తెలుస్తుంది. సో 2024 లోనే కృతి శెట్టి తిరిగి ఫాంలోకి వస్తుందని చెప్పొచ్చు. ఇక కెరీర్ మొదట్లో ఫోటో షూట్స్ కి అంతగా ఆసక్తి చూపించని కృతి శెట్టి ఈమధ్య గ్లామర్ గేట్లు ఎత్తేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.

సినిమాల కన్నా ఈ ఫోటో షూట్స్ తోనే కొందరు భామలు ఆడియన్స్ ని అలరిస్తున్నారు. రాబోయే సినిమాల రిలీజ్ వరకు కృతి శెట్టి కూడా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని తన ఫోటో షూట్ తోనే ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. బేబమ్మలో ఈ మార్పుని చూసి ఆడియన్స్ కూడా వావ్ అనేస్తున్నారు. కెరీర్ లో కూడా అమ్మడు ఊపందుకుంటే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.