Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్ లో పేంప‌ర్ చేస్తోన్న బ్యూటీ!

కృతి కర్బందా ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంటుంది

By:  Tupaki Desk   |   19 Nov 2023 8:28 AM GMT
స్టైలిష్ లుక్ లో పేంప‌ర్ చేస్తోన్న బ్యూటీ!
X

కృతి కర్బందా ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంటుంది. ఎలివేష‌న్ల‌లోనే త‌న‌దైన మార్క్ వేస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లోనే అందాల‌న్ని అన్నింటిని ఎంచ‌క్కా దార‌బోస్తుంది. లో దుస్తుల్లో సైతం ఇప్ప‌టికే ఎన్నో సార్లు ట్రీట్ ఇచ్చింది. సినిమాలు చేయ‌క‌పోయినా? ఇన్ స్టాలో ల‌క్ష‌ల మంది అభిమానాన్ని సంపాదించుకుందంటే? బ్యూటీలో అస‌లైన కార‌ణం ఆ ఎలివేష‌న్ అన‌క త‌ప్ప‌దు.


తాజాగా పోస్ట్ చేసిన పిక్ లో ఎలివేష‌న్ కంటే స్టైలింగ్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిగో ఇక్క‌డిలా సిమెంట్ రంగు ఔంట్ ఫిట్ లో త‌ళుకులీనింది. అమ్మ‌డి బాడీకి ప‌ర్పెక్ట్ గా ఫిట్ అయిన దుస్తులివి. బికినీ పోలిన ఈ డిజైన్డ్ డ్రెస్ లో కృతి గ్లామ‌ర్ షో అంతే ఆక‌ట్టుకుంటుంది. బాట‌మ్ నుంచి థై షో ట్రీట్ మామూలు గా లేదు. ఇక మోకాళ్ల వ‌ర‌కూ వేసుకున్న బూట్లు అమ్మ‌డు ప్యాష‌న్ ఎంపిక ప‌ట్ల ఎలా ఉంటుంద‌న్న‌ది అద్దం ప‌డుతుంది.

అన్నింకంటే కెమారా యాంగిల్ వావ్ అనిపిస్తుంది. కెమెరా క్లోజ్ షాట్ కృతిలో స్టైలిష్ ని ఆవిష్క‌రిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. కృతి అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోల‌తో కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏవి కెరీర్ ప‌రంగా క‌లిసి రాలేదు. మంచి అవ‌కాశాలైతే వ‌చ్చాయిగానీ..స‌క్సెస్ లో మాత్రం వెనుక‌బ‌డే ఉంది.

బాలీవుడ్ లోనూ వేగంగా సినిమాలు చేస్తున్న‌ట్లు క‌నిపించలేదు. ఆరంభంలో చూపించినంత ఉత్సాహం ఇప్పుడు లేదు. రెండేళ్ల‌గా అక్క‌డా సినిమాలు చేస్తున్న‌ట్లు లేదు. కొత్త అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుందిగానీ రావ‌డం లేదు. దీంతో నెటి జ‌నుకు ఇలా సోష‌ల్ మీడియాలో ట‌చ్ లో ఉంటుంది.