ముంబై వర్షాలు.. సెగలు పుట్టించేలా 'కృతి' అందాలు!
కృతి కర్భందా.. బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 25 July 2024 1:52 PM GMTకృతి కర్భందా.. బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు మూవీ బోణీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాలో తన అందం, అభినయంతో అలరించింది. స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాదే చిర్రు మూవీతో శాండిల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో తన యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది కృతి.
ఆ తర్వాత తెలుగుతోపాటు కన్నడలో మంచి ఆఫర్లు పొందింది. అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ వంటి చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ బ్రూస్ లీలో హీరో అక్క పాత్రలో నటించి షాకిచ్చింది. అయితే వరుస సినిమాలు చేసిన అమ్మడికి టాలీవుడ్ లో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. హౌజ్‌ఫుల్-4 వంటి పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఒకట్రెండు హిట్లు సాధిస్తూ సినిమాలు చేస్తోంది.
రెండేళ్ల గ్యాప్ తర్వాత రీసెంట్ గా రిస్కీ రోమియో సినిమాలో నటించింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. దాంతోపాటు మరో సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇటీవల హీరో, తన ప్రియుడు పులకిత్ సామ్రాట్ తో ఏడడుగులు నడిచింది. కొంతకాలం ప్రేమలో మునిగి తేలిన వీరు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. అటు సినిమాలు.. ఇటు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న అమ్మడు.. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తుంటోంది.
క్రేజీ ఔట్ ఫిట్స్ లో క్లీవేజ్ షో చేస్తుంటోంది. మిర్రర్ సెల్ఫీలు తీసుకుని అందాలు ఆరబోస్తుంటోంది. తన స్కిన్ షోతో ఫిదా చేస్తుంటోంది. హా* గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తుంటోంది. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వకుండా ఉండేలా పిక్స్ పోస్ట్ చేస్తుంటోంది. తాజాగా కొత్త పిక్ షేర్ చేసింది కృతి. క్రీమ్ కలర్ స్పెషల్ ఔట్ ఫిట్ లో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో జోరుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి క్రేజీగా క్యాప్షన్ పోస్ట్ పెట్టింది బ్యూటీ.
హెయిర్ లీవ్ చేసుకుని ఓరగా చూస్తూ కుర్రకారును మాయ చేస్తోంది. ఎద అందాలతో అందరినీ కవ్విస్తూ సెగలు రేపుతోంది. అందమంతా తనలో ఉందన్న విధంగా హీట్ పుట్టిస్తోంది. వయ్యారంగా నిల్చుని మనసులు దోచేస్తోంది. ప్రస్తుతం అమ్మడి పిక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఓవైపు వర్షాలు.. మరోవైపు హీట్ పుట్టించే అందాలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కృతి ఎవర్ గ్రీన్ అంటూ కొనియాడుతున్నారు. అందానికి ఇమేజ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.