Begin typing your search above and press return to search.

చేతుల నిండా టాటూలే, కానీ శారీలో కేకపెట్టించింది..!

అయితే, ఖుషీ సినిమాల్లోకి అడుగుపెట్టకముందే, తన అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:50 AM GMT
చేతుల నిండా టాటూలే, కానీ శారీలో కేకపెట్టించింది..!
X

అందాల తార, దివంగత నటి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే. పెద్ద కూతురు జాన్వీ అందరికీ సుపరిచితమే. బాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది. తల్లి లాగానే, దక్షిణాదిన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో దేవర మూవీతో అడుగుపెడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ తర్వాత ఖుషీ కూడా సినిమాల్లో అడుగుపెట్టాలని చూస్తోంది.



అయితే, ఖుషీ సినిమాల్లోకి అడుగుపెట్టకముందే, తన అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతలా అంటే, అక్కను మించిన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా నీలిరంగు చీరలో మెరిసిపోయింది. ఆమె చీర కట్టిన విధానం దగ్గర నుంచి, దానికి తగినట్లు ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే, ఎంతటివారికైనా చెమటలు పట్టేలా ఉన్నాయి.


ఖుషీ గతంలో చాలా సార్లు మోడ్రన్ డ్రెస్సల్లో మెరిసింది. కానీ, ఈ సారి చీరలో చాలా హాట్ గా కనపడింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, చికెన్ కారీ చీరలో, హెయిర్ లూస్ గా వదిలేసి మరింత అందంగా కనపడుతుంది. చీరల్లో హాటు ఫోజులు ఇస్తూ, తన చేతులపై టాటూలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్లు టాటూలు వేయించుకోవడం చాలా కామన్.


ఎక్కడో, ఒకటో రెండో టాటూలు వేయించుకుంటారు.కానీ, ఖుషీ ఏకంగా తన రెండు చేతుల నిండా టాటూలు వేయించుకోవడం విశేషం. మామూలుగా అయితే, ఆ టాటూలు కనిపించడం లేదు. కానీ, ఆమె తన చేతులు పైకి ఎత్తి, ఫోటోలకు ఫోజులు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ టాటూలు కనపడుతున్నాయి. కేవలం చేతులమీదే చాలా ప్లేసుల్లో వేయించుకోవడం గమనార్హం.


ఇక, ఖుషీ తన బాలీవుడ్ లాంచింగ్ కి రెడీ అవుతోంది. తన ఎంట్రీకి సరిపోయే మూవీ స్టోరీ కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు జాన్వీ తెలుగులో దేవర మూవీతో అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీ తర్వాత జాన్వీకి తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. తమిళంలోనూ ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.