Begin typing your search above and press return to search.

50 ఏళ్ల మ‌లైకా పాతిక ప్రాయంలా!

నటి.. మోడల్ కం ఫిట్ నెస్ ఔత్సాహికురాలు మలైకా అరోరా తనదైన అందం వ‌య్యారంతో కుర్రాళ్ల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటివ్వ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అంటే అతిశ‌యోక్తి కాదు

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:30 AM GMT
50 ఏళ్ల మ‌లైకా పాతిక ప్రాయంలా!
X

నటి.. మోడల్ కం ఫిట్ నెస్ ఔత్సాహికురాలు మలైకా అరోరా తనదైన అందం వ‌య్యారంతో కుర్రాళ్ల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటివ్వ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అంటే అతిశ‌యోక్తి కాదు. మైండ్ బ్లోవింగ్ అనిపించే ఫ్యాషన్ ఎంపికలు .. గుండె గుభేల్ మ‌నిపించే గ్లామరస్ లుక్స్ తో మ‌తులు చెడ‌గొట్ట‌డం మ‌లైకా హాబీ. ఆల్ట్రా మోడ్ర‌న్ బ్యూటీగానూ మ‌లైకా ఎంపిక‌లు ఎప్పుడు వావ్ అనిపిస్తుంటాయి.


తాజాగా అమ్మ‌డు తన 50వ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని మలైకా అరోరా ఫెమినా ఫోటోషూట్‌లో ఒదిగి పోయింది. 50 ఏళ్ల మ‌లైకా లుక్ 25 ప్రాయాన్ని త‌ల‌పించింది అంటే అతిశ‌యోక్తి కాదు. ఫస్ట్ లుక్‌లో మలైకా గోధుమ రంగు షోల్డ‌ర్ లెస్ డిజైన్ లో త‌ళుకులీనింది. నెక్ లెస్.. స్ట్రాపీ డ్రెస్‌లో టైమ్‌లెస్ ఆకర్షణలో క‌ట్టిప‌డేస్తుంది. సాగ‌ర‌క‌న్య లాంటి దుస్తుల్లో మ‌లైకా మ‌రింత అందంగా క‌నిపించింది.


డిజైన‌ర్స్ వ‌య‌సు మ‌ర్చిపోయేలా చేస్తాయంటే? అది ఇదేనేమో అన్నంత‌గా మ‌లైకా ఎలివేట్ అవుతుంది. ఇక మ‌రో న్యూ ఎరైవ‌ల్స్ లోనూ మ‌లైకా చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. వైట్ ష‌ర్ట్ బ్లేజ‌ర్ షార్ట్‌లో అమ్మ‌డు ఆక‌ర్షణీయంగా క‌నిపిస్తుంది. అమ్మ‌డి టోన్డ్ థైస్ తో వావ్ అనిపిస్తుంది. థైని బిగువుగా ప‌ట్టేసిన బ్లాక్ ప్రాక్ మ‌రింత షైనింగ్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. మ‌లైకా పై ఇప్ప‌టివ‌ర‌కూ ముదుర భామ అంటూ కామెంట్లు ఎక్కువ‌గా వైర‌ల్ అయ్యేవి. న్యూ ఎరైవ‌ల్స్ లో అమ్మ‌డు వాటికి చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది. టోన్డ్ బాడీ లుక్ లో మ‌రింత ఆక‌ట్టుకుంటుంది. ఎంపిక చేసుకున్న డిజైనర్స్ ఆమెని మ‌రింత అందంగా ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.