Begin typing your search above and press return to search.

వీడియో: మ‌ర్డర్ బ్యూటీ పూల్ సైడ్ ట్రీట్

బాలీవుడ్ శృంగార నాయిక మ‌ల్లికా షెరావ‌త్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్ప‌టికీ మ‌ల్లిక సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:26 AM GMT
వీడియో: మ‌ర్డర్ బ్యూటీ పూల్ సైడ్ ట్రీట్
X

బాలీవుడ్ శృంగార నాయిక మ‌ల్లికా షెరావ‌త్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్ప‌టికీ మ‌ల్లిక సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. హిస్‌..స్ - RK/RKAY లాంటి చిత్రాల‌ త‌ర్వాత బాలీవుడ్ న‌టి మల్లికా షెరావత్ లైమ్ లైట్ కి దూర‌మైంది. అంత‌కుముందు జాకీచాన్ లాంటి హాలీవుడ్ స్టార్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. మ‌ర్డ‌ర్ లాంటి బోల్డ్ చిత్రంలో న‌టించిన మ‌లైకా కెరీర్ ఆద్యంతం బోల్డ్ పెర్ఫామెన్స్.. హాట్ స్టైల్ స్టేట్‌మెంట్స్ తో వివాదాస్పద రాణి బిరుదును అందుకుంది. అయితే ట్రోలింగ్ ఎంత ఎదురైనా కానీ.. 46 ఏళ్ల మ‌ల్లిక‌ మళ్లీ మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.

అందాల్ని ఆర‌బోయ‌డంలో తనకంటూ ఒక స్టాండ్ తీసుకోవడానికి భయపడకుండా ఎల్లప్పుడూ తన మనస్సులో ఉన్నదే చేస్తుంది. ఉన్నది ఉన్న‌ట్టుగా మాట్లాడుతుంది. మల్లికా నిర్భయ వైఖరి సోషల్ మీడియా పోస్ట్‌లలో కూడా ప్రతిబింబిస్తుంది. తన గురించి పుకార్లు ఎన్ని షికార్లు చేసినా వాటిని ప‌ట్టించుకోదు. తనకు నచ్చిన విధంగా బోల్డ్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంది. నాకోసం నేను అనే వైఖ‌రి మ‌ల్లిక‌లో తొలి నుంచి చూస్తున్న‌దే.

తాజాగా పుట్టినరోజు సందర్భంగా మ‌ల్లిక రెడ్ హాట్ లుక్ తో గుబులు రేపింది. ఎరుపు రంగు బికినీలో పూల్ సైడ్ ట్రీట్ ని ఆస్వాధిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. త‌డిసిన ఆ హెయిర్ ని ముడివేసి అలా ఎర్ర మందారం పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో స‌ర‌సంగా క‌నిపించింది. పూల్ సైడ్ వాతావ‌ర‌ణం అంతే ఆహ్లాదంగా క‌నిపిస్తోంది. పచ్చదనంతో నిండిన వాతావ‌ర‌ణంలో ఈత కొలను ప్లెజెంట్ లుక్ ని తెచ్చింది. ఒక ర‌కంగా మ‌ల్లిక మ‌త్స‌కన్య‌లా స్వేచ్ఛ‌ను ఆస్వాధించింది. తాజాగా రిలీజైన వీడియోకు మ‌ల్లిక‌ ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది, ''బ‌ర్త్ డే గాళ్‌.. ఫిట్ & ఫ్యాబులస్. మీలోని దేవతను ఆలింగనం చేసుకోండి. దివ్యమైన‌ స్త్రీ శక్తిని ప్రసరింపజేయండి'' అని వ్యాఖ్య‌ను జోడించింది.

గత వారం జిమ్‌లో చెమటలతో త‌డిసిన త‌న దేహ‌శిరుల్ని ప్రెజెంట్ చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెల్లటి స్పోర్ట్స్ బ్రాలో మెరిసిపోయిన మ‌ల్లిక ఇప్పుడు రెడ్ హాట్ స్విమ్ సూట్ లో అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

లాస్ ఏంజెల్స్‌లో నివసించే మల్లిక ఖ్వాహిష్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మర్డర్, హిస్స్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్‌కమ్ వంటి చిత్రాలతో పాపుల‌రైంది. చివరిగా రజత్ కపూర్, కుబ్రా సైత్, రణవీర్ షోరేలతో కలిసి RK/RKAY అనే థ్రిల్లింగ్ డ్రామా చిత్రంలో కనిపించింది. RK/RKAY ప‌లు అంత‌ర్జాతీయ‌ చలనచిత్రోత్సవాలలో ప్ర‌ద‌ర్శిత‌మైంది.