మాల్వీ మల్హోత్రా… సినిమా రిలీజ్ కాకుండానే కాంట్రవర్సీ
మాల్వీ మల్హోత్రా పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు
By: Tupaki Desk | 6 July 2024 7:07 AM GMTమాల్వీ మల్హోత్రా పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. తిరగబడర సామి సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకుండా మాల్వీ మల్హోత్రా తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ సినిమా కంటే ముందు మాల్వీ హిందీలో ఒక సినిమా, మలయాళంలో ఒక మూవీ చేసింది.
అయితే తెలుగులో రాజ్ తరుణ్ సినిమా ఆమెని ఏకంగా కాంట్రవర్సీలో పడేసింది. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మాల్వీ మల్హోత్రా పైన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ ని నాకు కాకుండా చేయాలని మాల్వీ మల్హోత్రా ప్రయత్నం చేస్తుందని, నన్ను ఆమె అన్నయ్యతో కలిసి బెదిరిస్తుందని లావణ్య ఆరోపిస్తుంది. మా నాన్నకి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాగా క్లోజ్, నిన్ను చంపేసి డెడ్ బాడీ కూడా కనిపించకుండా మాయం చేస్తాం అంటూ వార్నింగ్స్ ఇస్తుందని లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ఈ బెదిరింపుల నేపథ్యంలోనే ప్రాణ రక్షణ కోసం పోలీసులకి ఫిర్యాదు చేశానని మీడియాతో తెలిపింది. అలాగే నాతో 11 ఏళ్ళు రిలేషన్ లో ఉండి, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రాజ్ తరుణ్ మోసం చేసాడని లావణ్య ఆరోపిస్తుంది. వారి బంధువులు కూడా రాజ్ తరుణ్ ని వదిలేయాలని బెదిరిస్తున్నారని మీడియాకి తెలియజేసింది. అయితే మాల్వీ మల్హోత్రా కూడా ఈ ఆరోపణలపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్ తరుణ్ కెరియర్ పరంగా మళ్ళీ గాడిలో పడే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేసిన తిరగబడర సామి మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. దీని తర్వాత పురుషోత్తముడు సినిమా కూడా ఈ ఏడాదిలోనే రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతోందంట. కొన్ని నెలల క్రితం అతని ప్రియురాలు లావణ్య డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఆ సమయంలో అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండాలని అనుకున్నాడంట. అందుకే లావణ్యని విడిచిపెట్టి బయటకొచ్చేసాడంట.
అయిన కూడా లావణ్య రాజ్ తరుణ్ ని బలవంతంగా రోడ్డు మీదకి లాక్కొని వచ్చింది. ఈ వివాదం రాజ్ తరుణ్ కెరియర్ కి ఎంతో కొంత విఘాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇమేజ్ కూడా దెబ్బ తీస్తుందని, టాలీవుడ్ లో అవకాశాలు దూరం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లావణ్య తన ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రాజ్ తరుణ్ కూడా ఇంత వరకు వచ్చాక నేను తగ్గను అంటూ లావణ్యపై లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ఇష్యూ మరి ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాజ్ తరుణ్ అయితే తన వైపు నుంచి లావణ్య చేసిన ఆరోపణల విషయంలో క్లారిటీ ఇచ్చారు. మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ లో లేనని చెప్పారు. అలాగే తనకి డ్రగ్స్ అలవాటు లేదని, కానీ లావణ్య బాగా ఎడిక్ట్ అయ్యిందని అన్నారు. పెళ్లి గురించి లావణ్యకి నేనెప్పుడు ప్రామిస్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.