Begin typing your search above and press return to search.

జక్కన్న హీరోయిన్‌ అందం చూశారా..!

తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మన్నారా చోప్రా

By:  Tupaki Desk   |   22 Aug 2024 5:30 PM GMT
జక్కన్న హీరోయిన్‌ అందం చూశారా..!
X

తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మన్నారా చోప్రా. మోడలింగ్‌ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు 2014 లో అంటే దాదాపు దశాబ్ద కాలం క్రితం 'జిద్‌' సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. తెలుగు లో జక్కన్న సినిమాతో పాటు రోగ్‌ ఇంకా సీత సినిమాల్లో కూడా నటించడం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కాస్త ఆఫర్లు తగ్గడంతో మళ్లీ ప్రయత్నాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తోంది.

హిందీ బిగ్ బాస్‌ సీజన్‌ 17 లో పాల్గొనడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని మరోసారి ఆకర్షించింది. కెరీర్‌ ఆరంభంలో ఎలా అయితే అందంగా, నాజూకుగా మన్నార చోప్రా కనిపించిందో అదే విధంగా ప్రస్తుతం కూడా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వార కనిపిస్తోంది. తాజాగా మరోసారి మన్నారా చోప్రా అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. విభిన్నమైన ఔట్ ఫిట్‌ తో మన్నారా లుక్ భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మన్నారా అందం గురించి వావ్‌ అంటూ ప్రశంసిస్తూ లైక్‌, షేర్ చేస్తున్నారు.

ఢిల్లీ లో ఉన్నత చదువులు పూర్తి చేసిన మన్నార చోప్రా ముంబైకి వెళ్లింది. అక్కడ మోడలింగ్‌ ను కెరీర్ గా ఎంపిక చేసుకుని మెల్ల మెల్లగా మోడల్ గా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా సల్మాన్‌ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ మరియు సెలబ్రిటీలతో యాడ్స్ లో కలిసి నటించే అవకాశం మన్నారా చోప్రాకి దక్కింది. ఆ అవకాశాల కారణంగా మన్నార కి సినిమాల్లో నటించే అవకాశాలు మొదలు అయ్యాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో జక్కన్న హీరోయిన్‌ మన్నారా కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.

ప్రియాంక చోప్రా కజిన్ అయినప్పటికీ మన్నారా చోప్రా కి పెద్దగా ఉపయోగం లేదు అనేది ఆమె సన్నిహితుల మాట. నటిగా బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో అలరించే విధంగా ప్లాన్ చేసుకోవడం ఈమె చేసిన పెద్ద తప్పు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మళ్లీ మన్నారా ఇండస్ట్రీలో బిజీ అవ్వబోతుందని, ఈసారి హిందీ ప్రేక్షకులు కచ్చితంగా మన్నారా ను అంగీకరించడం ఖాయం. తెలుగు లో కూడా మన్నారా మళ్లీ నటించాలని కొందరు నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ మెసేజ్‌ లు చేస్తున్నారు.