పిక్ టాక్ : చీర కట్టిన మిస్ వరల్డ్
మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె వెంట పడ్డారు
By: Tupaki Desk | 29 Dec 2023 4:57 AM GMT67వ మిస్ వరల్డ్ 2017 కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్ హీరోయిన్ గా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతో అక్కడ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఈమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె వెంట పడ్డారు. కానీ ఆమె మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉంది. తాజాగా బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేస్తోన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ఇక సోషల్ మీడియా ద్వారా మానుషి చిల్లర్ రెగ్యులర్ గా నెటిజన్స్ ని మరియు తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు చీర కట్టుకుని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. గోవాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మానుషి ఇలా సందడి చేసింది.
బంగారు వర్ణపు చీర కట్టి చాలా అందంగా, బుట్ట బొమ్మగా కనిపిస్తున్న మానుషి చిల్లర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తున్న మానుషి చిల్లర్ ను భవిష్యత్తులో సౌత్ స్టార్ హీరోలకు జోడీగా చూస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.