Begin typing your search above and press return to search.

రెస్టారెంట్ లో మానుషీ.. మంట పుట్టిచిందిలా!

మాజీ మిస్ వ‌ర‌ల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్ల‌ర్ ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:30 PM GMT
రెస్టారెంట్ లో మానుషీ.. మంట పుట్టిచిందిలా!
X

మాజీ మిస్ వ‌ర‌ల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్ల‌ర్ ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో తానో బ్రాండ్ బ్యూటీ. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో అల‌రించ‌డం మానుషీ ప్ర‌త్యేక‌త‌. మోడ‌లింగ్ లో ఆరితేరిన బ్యూటీ కావ‌డంతో న‌లుగురిలో మ‌రింత స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంటుంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా రెస్టారెంట్ లో కాక‌ పుట్టించే క్లీవేజ్ బ్యూటీని ఆవిష్క‌రించింది.

వైట్ డిజైన్ బ్లౌజ్ లో మానుషీ మంట‌లు మామూలుగా లేవు. అమ్మ‌డి స్కిన్ టోన్..గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్ తో త‌ళ‌త‌ళలాడిస్తోంది. క‌ళ్ల‌కు స‌న్ గ్లాసెస్ ధ‌రించింది. మానుషీ ఎలివేష‌న్ ప్ర‌తీది విదేశీ బ్యూటీల్నే త‌ల‌పిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మానుషీ బ్యూటీకి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. `లు కింగ్ హాట్..వేర్ ఈజ్ మై బ‌ర్త్ డే గిప్ట్ అంటూ ఎంతో ప్రియంగా అభిమానించాడు ఓ వీరాభిమాని.

ఇక మానుషీ కెరీర్ సంగ‌తి చూస్తే! ఏ ముహూర్తాన లాంచ్ అయిందో గానీ అన్నీ ప‌రాజ‌యాలే. డెబ్యూ `సామ్రాట్ పృధ్వీరాజ్` ఆశించిన ఫ‌లితా న్నివ్వ‌లేదు. అటుపై న‌టించిన `గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ` కూడా నిరాశ‌న‌మే మిగిల్చింది. టాలీవుడ్ వెంచర్ `ఆపరేషన్ వాలెంటైన్` అదే వ‌రుస‌లో నిలిచింది. ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో ఇక్క‌డ అవ‌కాశాలే లేకుండా పోయాయి.

అలాగే ఇటీవల బాల‌వుడ్ లో విడుదలైన `బడే మియాన్ చోటే మియాన్` కూడా డిజాస్ట‌ర్ నే న‌మోదు చేసింది. క‌నీసం ఈ సినిమా అయినా స‌క్సెస్ అవుతుంద‌ని చాలా ఆశ‌లు పెట్టుకుంది. అక్క‌డా మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక చిత్రం ఉంది. జాన్ అబ్రహంతో క‌లిసి ` టెహ్రాన్` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాతో హిట్ అందుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. లేదంటే కెరీర్ ప్ర‌శ్నార్ధ‌క‌రంగా మారుతుంది. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే కెరీర్ లో ఐద‌వ ప‌రాజ‌యం ఎదుర‌వుతుంది.