Begin typing your search above and press return to search.

గుంటూరు కారం తర్వాత అమ్మడిని అందుకోగలరా..?

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి ఆ సినిమాతో అందరి దృష్టిలో పడింది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:21 AM GMT
గుంటూరు కారం తర్వాత అమ్మడిని అందుకోగలరా..?
X

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి ఆ సినిమాతో అందరి దృష్టిలో పడింది. అసలే తెలుగులో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉంటుంది.ఈ టైం లో కొంత టాలెంట్ చూపించేస్తే చాలు వారికి స్టార్ స్టేటస్ ఇచ్చేస్తారు. ఈ క్రమంలో మీనాక్షి కూడా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. మొదటి 2, 3 సినిమాలు యువ హీరోలతో చేసిన మీనాక్షి లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ఆమెకు అవకాశం రావడం అమ్మడి ఫేట్ మార్చేసింది. మహేష్ సినిమా తర్వాత మీనాక్షి రేంజ్ కచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది.

గుంటూరు కారం లో మీనాక్షి ఆడియన్స్ ని అలరిస్తే మాత్రం ఇక ఆమె కెరీర్ కి తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఇప్పటికే తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని డిస్టర్బ్ చేస్తున్న మీనాక్షి భారీ ఆఫర్లతో కూడా అదరగొట్టేస్తుంది. గుంటూరు కారం లో శ్రీలీలకు ఈక్వల్ రోల్ లో మీనాక్షి పాత్ర ఉంటుందట. ఇద్దరు యువ హీరోయిన్స్ కూడా పోటీ పడి తమ పాత్రల్లో నటించారని తెలుస్తుంది.

మీనాక్షి అయితే తన సోషల్ మీడియా అప్డేట్స్ తో కూడా ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. తన క్యూట్ స్టిల్స్, స్కిన్ షో ఫోటోస్ అన్నీ కూడా ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ అందిస్తున్నాయి. వీటికి తగినట్టుగా సినిమాల్లో కూడా లక్ కలిసి వస్తే మాత్రం మీనాక్షి కాబోయే స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే తన ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్న మీనాక్షి తప్పకుండా ఫ్యూచర్ లో టాప్ ప్లేస్ కి వెళ్తుందని చెప్పొచ్చు.

మహేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కరుణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న మట్కా సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో మీనాక్షి కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటబోతుంది. మహేష్ తో ఒక సినిమా.. వరుణ్ తేజ్ తో నెక్స్ట్ సినిమా ఈ రెండు సినిమాలతో మీనాక్షి తన స్త్రెంత్ చూపిస్తుందని ఫిక్స్ అయ్యారు ఆమె ఫాలోవర్స్. సినిమాలే కాదు ఆమె ఫోటో షూట్స్ కూడా ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. మీనాక్షి చౌదరి ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అని ఇప్పటికే కొన్ని సంకేతాలు వస్తుండగా సినిమాల ఫలితాలు అందుకు సహకరిస్తాయా లేదా అన్నది చూడాలి.