Begin typing your search above and press return to search.

మీనాక్షి చౌద‌రి అవ‌కాశాల వెనుక ర‌స‌హ్యం ఇదే

టాలీవుడ్ లో హ‌రియానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి పేరు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2023 6:12 AM GMT
మీనాక్షి చౌద‌రి అవ‌కాశాల వెనుక ర‌స‌హ్యం ఇదే
X

టాలీవుడ్ లో హ‌రియానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి పేరు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్క‌సారిగా అగ్ర హీరోల‌తో ఛాన్సులందుకుంటూ షాకులిస్తుంది. త‌న‌క‌న్నా ప్ర‌తిభావంతులు..అంద‌గ‌త్తెలు చాలా మంది ఉన్నా! వాళ్లెవ‌ర్ని వ‌రించని అవ‌కాశాలు మీనాక్షి వెంట ప‌డుతున్నాయి. మ‌రి ఇన్ని అవ‌కాశాలు ఎలా సాధ్య‌మ‌వుతున్నాయి? మిగతా హీరోయిన్ల‌లో లేని ప్రత్యేక‌త మీనాక్షిలో ఏమున్న‌ట్లు? ప‌నిగట్టుకుని ద‌ర్శ‌కులంతా ఈమె చుట్టూనే ఎందుకు తిర‌గుతున్న‌ట్లు? అంటే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం లీకైంది.

అమ్మ‌డు బిజీ న‌టిగా మార‌డానికి కార‌ణం త‌న హైట్ కీ రోల్ పోషించిన‌ట్లు తెలుస్తోంది. `హిట్ -2` లో అడ‌వి శేష్ అవ‌కాశం ఇవ్వ‌డానికి కార‌ణం మీనాక్షి ఎత్తు అట‌. శేషు ఆర‌డులు ఎత్తు ఉంటే త‌న హైట్ కి మ్యాచ్ అయ్యేలా ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అన్న స‌మ‌యంలో మీనాక్షి తార‌స ప‌డిందిట‌. మీనాక్షి 5.8 ఎత్తు ఉండ‌టంతో శేష్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `మ‌ట్కా`లో న‌టిస్తోంది. ఇందులో అవ‌కాశం రావ‌డం వెనుక కూడా ఎత్తు ప్ర‌ధాన కార‌ణం కావొచ్చు. వ‌రుణ్ తేజ్ భారీ గా ఎత్తు ఉన్న‌వాడే. ఇతగాడి ఎత్తుకి హీరోయిన్లు సెట్ అవ్వ‌డం అన్న‌ది తొంద‌ర‌గా జ‌రిగే ప‌నికాదు. మీనాక్షిలో ట్యాలెంట్ తో పాటు..ఎత్తు చూసి ఛాన్స్ ఇచ్చిన‌ట్లు చెప్పొచ్చు. అలాగే మ‌హేష్ స‌ర‌స‌న `గుంటూరు కారం`లోనూ ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

పూజాహెగ్డే ఎగ్జిట్ అవ్వ‌డంతో ఆ స్థానాన్ని శ్రీలీల‌తో భ‌ర్తీ చేసి....ఆమె స్థానంలో మీనాక్షి ని తీసుకున్నారు గురూజీ త్రివిక్ర‌మ్. ఈయ‌న తొలి నుంచి మీనాక్షిని ప్రొత్స‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` నుంచి గురూజీ ఫాలో అవుతున్నారు. అందులో అమ్మ‌డి న‌ట‌న సైతం మెచ్చారు. అందుకే ఎగ్టిట్ అయిన హీరోయిన్ స్థానంలో మ‌రో ఆలోచ‌న లేకుండా మీనాక్షిని దించేసారు. ఎలాగూ మ‌హేష్ ఎత్తుకు త‌గ్గ హీరోయిన్ కాబ‌ట్టి తెర‌పైనా నిండుద‌నం క‌నిపిస్తుంది. అలాగే దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న `ల‌క్కీ భాస్క‌ర్` లోనూ న‌టిస్తోంది. దుల్క‌ర్ ఎత్తు 5.8... స‌రిగ్గా అదే ఎత్తు గ‌ల మీనాక్షిని తీసుకోవ‌డం విశేషం. మొత్తానికి మీనాక్షి అందుకుంటోన్న అవ‌కాశాల పాలిట ఎత్తు కీల‌క పాత్ర పోషిస్తుంది అన్న‌ది వాస్త‌వం.