Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : సాగర కన్యగా నాగిని భామ..!

మౌనికి ఉన్న ఈ ఇమేజ్ ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడేలా చేస్తుంది. ప్రస్తుతం మౌని ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:30 PM GMT
ఫోటో స్టోరీ : సాగర కన్యగా నాగిని భామ..!
X

నాగిని సీరియల్ తో ప్రేక్షకులను అలరించిన మౌని రాయ్ ఆ క్రేజ్ తో సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకుంది. అందరు హీరోయిన్ గా చేస్తే ఎలా అనుకుందో ఏమో కానీ తాను మాత్రం నెగిటివ్ రోల్ చేసేందుకే ఆసక్తి చూపిస్తా అనుకుంటూ మౌనీ రాయ్ అటు సీరియల్స్ లోనే కాదు సినిమాల్లో కూడా విలన్ రోల్స్ లో నటిస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రహ్మాస్త్ర లో లేడీ విలన్ గా మెప్పించిన మౌని రాయ్ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.


వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేస్తూ వెళ్తున్న అమ్మడు సినిమాలు సీరియల్స్ కన్నా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఎక్కువ ఫోటో షూట్స్ తో ఎంటర్టైన్ చేస్తుంది. మౌనీ ఇన్ స్టాలో ఫోటో షూట్ వచ్చింది అంటే ఆమె ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. గ్లామర్ షోలో తనను మించిన వారు ఎవరు లేరనేలా అమ్మడు అందాలను గుమ్మరించేస్తుంది. బికినీ వేసినా వేయకపోయినా మౌని ఫోటో షూట్ అంటే మినిమం ఓ రేంజ్ లో ఉంటుంది.

లేటెస్ట్ గా పింక్ కలర్ చంకీ డ్రెస్ లో సాగర్ కన్యలా కవ్విస్తుంది మౌని. అలా సోఫా మీద వాలిపోతూ అమ్మడు లోపల అందాలను ప్రదర్శిస్తూ మౌని మత్తెక్కించేస్తుంది. మౌని ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మాల్సిందే. అసలు ఈ అమ్మడిది హీరోయిన్ కటౌట్ అయినా కూడా లేడీ విలన్ గా ముద్ర వేసి వెనకపడేలా చేస్తున్నారు.

మౌనికి ఉన్న ఈ ఇమేజ్ ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడేలా చేస్తుంది. ప్రస్తుతం మౌని ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మౌని ప్రతి అప్డేట్ ఆమె ఫాలోవర్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. సినిమాల్లో ఛాన్స్ ల కోసం కాకపోయినా తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు మౌని ఇలా రెచ్చిపోతుందని తెలుస్తుంది. తెలుగులో కూడా మౌని రాయ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. మరి అమ్మడు ఇక్కడ సినిమాల్లో ఎంట్రీ ఇస్తే అన్నా ఫేట్ మారుతుందేమో చూడాలి. టాలీవుడ్ లో ఇలాంటి భామలకు హీరోయిన్ ఛాన్స్ లు కూడా వస్తాయి. మౌని క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకునే మేకర్స్ ఎవరైనా ఆమెతో తెలుగులో సినిమా చేస్తే కచ్చితంగా అది బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. మౌని రాయ్ కూడా తెలుగులో అవకాశం వస్తే కాదని చెప్పకపోవచ్చు.