Begin typing your search above and press return to search.

న‌టి ఒంటి నిండా మ‌ర‌క‌లు.. ఆర్ట్ అంటోందేమిటి?

బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది

By:  Tupaki Desk   |   26 July 2024 3:00 AM GMT
న‌టి ఒంటి నిండా మ‌ర‌క‌లు.. ఆర్ట్ అంటోందేమిటి?
X

బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది. ఈ భామ ఆరంభం టీవీ స్క్రీన్ల‌పై ఎంత ప‌ద్ధ‌తిగా క‌నిపించిందో ఆ త‌ర్వాత సినీన‌టి అయ్యాక అంత బోల్డ్ గా మారిపోయింది. తెర‌ను బ‌ట్టి అవ‌స‌రాన్ని బ‌ట్టి గ్లామ‌ర్ ని ఎలివేట్ చేయ‌డం ప్రారంభించింది. ఇటీవ‌ల హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో మౌని మ‌తులు చెడ‌గొడుతోంది.

తాజాగా మ‌రోసారి మౌని త‌న‌దైన శైలిలో చెల‌రేగింది. ఈసారి చీరలో సింగారం ప్ర‌ద‌ర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ - చీర‌క‌ట్టుతో మ‌తులు చెడ‌గొట్టింది. మౌని తెల్ల చీర‌- ర‌వికె, కాంబినేష‌న్ గాజుల‌తో మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిచ్చింది. అలా శిరోజాలు విర‌బూసి కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. అయితే ఆ చీర‌కు దేహ‌శిరుల‌కు అంటిన మ‌ర‌క‌లేమిటో అర్థం కావ‌డం లేదని వాపోతున్నారు యూత్.

అయినా న‌న్ను ఇలా చూసి చూసి కంగారు వల‌దు.. ఇది ఒక ఆర్ట్! అంటూ ప‌రిచ‌యం చేసింది గ్రేట్ మౌని రాయ్. మౌని ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా, వాటిలో కొన్ని పోటోల్లో మౌని తెల్ల చీర‌లో త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది కానీ అక్క‌డ మ‌ట్టి అంటిన‌ట్టు క‌నిపించ‌లేదు. దీనిని బ‌ట్టి ఆ గాజు అద్దాల్లోనే ఆర్ట్ అంతా దాగి ఉంద‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది. మాయ‌దారి మౌని ఆ వివ‌రం ఏమిటో స్ప‌ష్ఠంగా ఇప్ప‌టికైనా చెబుతుందా లేదా? అంటూ యూత్ ప్ర‌శ్నిస్తున్నారు.

మౌని కెరీర్ విష‌యానికి వ‌స్తే అంద‌నంత ఎత్తుకు ఎదిగింది. ఏక్తా కపూర్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ`తో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించినప్పటి నుండి మౌని రాయ్ చాలా ఎత్తుకు ఎదిగారు. నాగిన్‌లో నటించిన తర్వాత ఈ బ్యూటీ బాగా పాపుల‌రైంది. మౌని 2018లో అక్షయ్ కుమార్ `గోల్డ్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అలాగే అయాన్ ముఖర్జీ భారీ చిత్రం బ్రహ్మాస్త్రలో కనిపించింది. ఇటీవల ఆమె జుబిన్ నౌటియాల్‌తో కలిసి `డోటరా` అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. మౌని రాయ్ చివరిసారిగా వెబ్ సిరీస్ `సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ`లో కనిపించింది.

ఇటీవలి ఇంటర్వ్యూలో మౌని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ .. బ్రహ్మాస్త్ర వంటి ప్రాజెక్టులు తనలోని న‌టి విష‌య‌మై ప్ర‌జ‌ల‌ అభిప్రాయాన్ని మార్చాయని అంది. `బ్రహ్మాస్త్ర` పూర్తిగా భిన్నమైనది. గోల్డ్, రా .. మేడ్ ఇన్ చైనా లోను విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు మంచి గుర్తింపు ద‌క్కింద‌ని మౌని తెలిపింది.