Begin typing your search above and press return to search.

టాప్ హీరోయిన్స్.. టైమ్ అస్సలు బాలేదు!

కాజల్ అగర్వాల్, సమంత తర్వాత టాప్ హీరోయిన్ పొజిషన్ ప్రస్తుతం ఖాళీ అయిపొయింది.

By:  Tupaki Desk   |   6 May 2024 5:30 PM GMT
టాప్ హీరోయిన్స్.. టైమ్ అస్సలు బాలేదు!
X

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులో పోటీలో ఉన్న అందాల భామలు అందరూ కూడా కెరియర్ పరంగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో సినిమా ఆఫర్స్ తెచ్చుకునే స్థాయిలో ఏ హీరోయిన్ ప్రెజెంట్ తెలుగులో కనిపించడం లేదని చెప్పాలి. కాజల్ అగర్వాల్, సమంత తర్వాత టాప్ హీరోయిన్ పొజిషన్ ప్రస్తుతం ఖాళీ అయిపొయింది.

ఈ ప్లేస్ కోసం పూజా హెగ్డే, రష్మిక మందన మధ్య గట్టి పోటీ నడిచింది. ఈ ఇద్దరు భామలు వరుస ఆఫర్స్ అందుకుంటూ జెట్ స్పీడ్ తో టాప్ స్టార్స్ గా మారిపోయారు. పూజా హెగ్డే రాధేశ్యామ్ సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుంది. తరువాత గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కోల్పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. టిల్లు క్యూబ్ కోసం తీసుకోవాలని అనుకుంటున్నారు.

రష్మిక మందనకి గత ఏడాది యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ పడింది. ప్రస్తుతం పుష్ప ది రూల్ చేస్తోంది. అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే రెండు సినిమాలు తెలుగులో చేస్తోంది. అలాగే హిందీలో చావ, పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కుభేర సినిమాలు చేస్తోంది. ఓ విధంగా టాలీవుడ్ ని మించి పాన్ ఇండియా లెవల్ కి ఆమె ఇమేజ్ వెళ్ళిపోయింది.

కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. హిందీలో బేబీ జాన్ అనే సినిమా మాత్రమే ఉంది. తెలుగులో ఒక్క మూవీ ఆఫర్ కూడా రాలేదు. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ హీరోయిన్ గా శ్రీలీల పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆమె ధమాకా తర్వాత హీరోయిన్ గా వరుస డిజాస్టర్స్ అందుకుంది. ఈ ఏడాది వచ్చిన గుంటూరు కారం కూడా ఫ్లాప్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ సినిమాల మీదనే ఆమె హోప్స్ పెట్టుకుంది.

ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కృతిశెట్టి బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంది. అయితే వాటిలో శ్యామ్ సింగరాయ్ తప్ప అన్ని డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె శర్వానంద్ కి జోడీగా మనమే అనే మూవీ చేస్తోంది. ఇది మాత్రమే ఆమె కెరియర్ ఎలా సాగాలనేది డిసైడ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. సమంత, తమన్నా, రాశిఖన్నా లాంటి హీరోయిన్స్ లాంటి వారు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. కొందరు సీనియర్ హీరోల పక్కన మాత్రమే నటిస్తున్నారు. అలాగే స్టార్స్ పక్కన ఛాన్స్ లు రాకపోవడంతో వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న చాలామంది హీరోయిన్స్ కు తప్పనిసరిగా ఒక్కో హిట్ పడాల్సిందే.