ఆమె పెళ్లి చేసుకుంటే సెకెండ్ ఇన్నింగ్స్ మరోలా!
పెళ్లైన భామలు..పిల్లలు సైతం కలిగిన సీనియర్ హీరోయిన్లు బాలీవుడ్ టూ టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 31 May 2024 3:30 PM GMTపెళ్లైన భామలు..పిల్లలు సైతం కలిగిన సీనియర్ హీరోయిన్లు బాలీవుడ్ టూ టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. నవ నాయికలకు సైతం రాని అవకాశాలు ఈ భామలంతా అందుకుని సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు. పారితోషికం విషయంలో మునుపటి కంటే మరింత మెరుగ్గా అందుకుంటున్నారు. ఒక్కో భామ ఐదు కోట్ల నుంచి 12 కోట్ల మధ్యలో అందుకుంటున్నారు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు సైతం సీనియర్లకే దక్కుతున్నాయి.
అయితే టాలీవుడ్ లో ఫేమస్ అయిన ఓ హీరోయిన్ మాత్రం ఈ అవకాశాలన్నీ కోల్పోతున్నట్లే కనిపిస్తుంది. కొంత గ్యాప్ తర్వాత కంబ్యాక్ అయిన ఆ బ్యూటీ ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తుంది. అలాగే ఇతర భాషలోనూ సీనియర్ హీరోకి జోడీగా నటిస్తుంది. కానీ ఆ బ్యూటీకున్న క్రేజ్ తో చాలా బిజీగా ఉండాలి. ఏడాదిలో కనీసం మూడు సినిమాలైనా రిలీజ్ చేయగలగాలి. కానీ ఆ సన్నివేశం కనుచూపు మేర ఎక్కడా కనిపించడం లేదు.
అవకాశం వస్తే చేయడం తప్ప! లేదంటే ఇంట్లో కూర్చోవడమే అన్నంత రిలాక్స్ గానే కనిపిస్తుంది. మరి ఈ భామ విషయంలో దొర్లిన తప్పిదం ఏంటి? అంటే అమ్మడు వయసు మీరినా పెళ్లి చేసుకోకపోవడం వల్ల కూడా అవకాశాలు రావడం లేదని ఓ వార్త వైరల్ అవుతుంది. తోటి వారంతా పెళ్లి చేసుకుని..పిల్లల్ని కని ఎంచక్కా హీరోయిన్లుగా బిజీగా కొనసాగుతున్నారు. కానీ ఈ సీనియర్ మాత్రం వాళ్లకు విరుద్దంగా ఉండటంతో దర్శక-నిర్మాతలు అనాసక్తి కనబరు స్తున్నారని ప్రతికూలత తెరపైకి వస్తోంది.
పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేస్తే అమ్మడిని నవ నాయికల కోటాలో చేర్చాలా? లేక వయసు ఆధారంగా సీనియర్ కోటాలో చేర్చాలో? అర్దం కాని గందరగోళం సైతం ఆ బ్యూటీ మార్కెట్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎంత స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కైనా కొన్ని అంశాలు ప్రత్యేక సందర్భాల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని..ఇప్పుడా భామ విషయంలో అదే జరుగుతుందని అంటున్నారు.