Begin typing your search above and press return to search.

మృణాల్ ని బొల్డ్ గా చూపించే డైరెక్ట‌ర్ కావాలి!

మృణాల్ కి మంచి పేరొచ్చింది. సంప్ర‌దాయ పాత్ర‌లో మృణాల్ ఓ ముద్ర వేసింది. దీంతో నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలోనూ అలాంటి పాత్ర‌లోనే క‌నిపిస్తుంది

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:30 PM GMT
మృణాల్ ని బొల్డ్ గా చూపించే డైరెక్ట‌ర్ కావాలి!
X

ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని డైరెక్ట‌ర్లు ఇంకా సీత‌గానే చూస్తున్నారా? ఆ పాత్ర నుంచి మేక‌ర్స్ బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారా? మృణాల్ ఒక‌ట‌నుకుంటే జ‌రిగేది మ‌రోలా ఉందా? అంటే అవున‌నే అనిపిస్తుంది. 'సీతారామం' చిత్రంలో అమ్మ‌డు సీత పాత్ర‌లో ఎంత గొప్ప‌గా మెప్పించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. హ‌ను రాఘవ‌పూడి ఆ పాత్ర‌కు అంత అద్భుతమైన రూపం ఇచ్చాడు. ల‌వ్ స్టోరీల్లో మ‌రో క్లాసిక్ హిట్ గా సీతారామం నిలిచింది.

మృణాల్ కి మంచి పేరొచ్చింది. సంప్ర‌దాయ పాత్ర‌లో మృణాల్ ఓ ముద్ర వేసింది. దీంతో నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలోనూ అలాంటి పాత్ర‌లోనే క‌నిపిస్తుంది. హాయ్ నాన్న‌లో అమ్మ‌డు డీసెంట్ రోల్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నాని ల‌వ‌ర్ గా..భార్య పాత్రలో మెప్పించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న డీసెంట్ రోల్ తోనే అల‌రించ‌బోతుంది.

ఈ విష‌యంలో మృణాల్ డిజ‌ప్పాయింట్ అవుతుందా? తాను ఒక‌ట‌నుకుంటే అందుకు అతీతంగా మ‌రొక‌టి జ‌రుగుతుందా? అంటే అలాగే క‌నిపిస్తుంది స‌న్నివేశం. ఇటీవ‌లి కాలంలో మృణాల్ ఠాకూర్ హాట్ హాట్ ఫోటోల‌తో చెలరేగుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో ట్రెడిష‌న‌ల్ గాక నిపించిన బ్యూటీ బ‌య‌ట మాత్రం కావాల్సినం బోల్డ్ నెస్ ని హైలైట్ చేస్తుంది. డైరెక్ట‌ర్లు అమ్మ‌డిని ఒక‌లా ఫోకస్ చేస్తుండే మృణాల్ మాత్రం త‌న‌ని వ్య‌క్తిగ‌తంగా మ‌రోలా ఫోక‌స్ చేసుకుంటుంది. ఇన్ స్టాలో వెడెక్కించే భంగిమ‌ల్లో ఫోజులిస్తోన్న వైనం తెలిసిందే.

దీన్ని బ‌ట్టి మృణాల్ సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది అన్న టాక్ బ‌లంగా వినిపిస్తుంది. అమ్మ‌డికిప్పుడు బోల్డ్ గా లాంచ్ చేసే డైరెక్ట‌ర్ ఒక‌రు కావాల‌ని ఆశ‌ప‌డుతుందంటున్నారు. వ‌రుస‌గా డీసెంట్ రోల్స్ చేయ‌డం కూడా కెరీర్ కి అంత మంచిది కాదు! ఒకేర‌క‌మైన ఇమేజ్ కే ప‌రిమి త‌య్యే అవ‌కాశం ఉంద‌ని మృణాల్ సైతం సీరియ‌స్ గానే థింక్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. అందుకే ఇలా ఆట‌విడుపులా అప్పుడ‌ప్పుడు నేను సీత పాత్ర‌కే ప‌రిమితం కాద‌ని ఇన్ స్టాలో సంకేతాలిస్తుంది.