Begin typing your search above and press return to search.

డార్లింగ్ నభా.. పువ్వు లాంటి డ్రెస్సులో ఇలా..

'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:49 AM GMT
డార్లింగ్ నభా.. పువ్వు లాంటి డ్రెస్సులో ఇలా..
X

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న నభా నటేష్, 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆమెకు లైమ్‌లైట్ తీసుకొచ్చింది. 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.

కానీ, అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమె కెరీర్‌లో బ్రేక్ తీసుకుంది. సీరియస్ గాయాల వల్ల రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆపరేషన్ కూడా చేయించుకున్న నభా, ఇప్పుడు గాయాల నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం నభా నటేష్ రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈమధ్య 'డార్లింగ్' అనే సినిమాలో ప్రియదర్శి సరసన నటించింది.

ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్న యువతిగా నభా కనిపించింది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లకు హాజరై ట్రైనింగ్ తీసుకుంది. ఆ సినిమాలో అమ్మడి నటనకు మంచి గుర్తింపు కూడా దక్కింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఆమె చేసిన పాత్రకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నభా, తన గ్లామరస్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

పువ్వు ఆకారంలో ఉన్న పొట్టి డ్రెస్‌లో సింపుల్ మేకప్‌తో వచ్చిన నభా, ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నభా నటేష్ ఎవరూ రీచుకోలేని అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నభా నటేష్ నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో కూడా నటిస్తోంది. పీరియాడిక్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్రలో కనిపించనుంది. నభా రీఎంట్రీలో ఈ రెండు సినిమాల ద్వారా ఎలా మెప్పిస్తుందో చూడాలి.