Begin typing your search above and press return to search.

లేడీ సూపర్‌ స్టార్ కవర్ ఫోటోలతో కవ్వింపులు

ఎల్లి ఫోటో షూట్ లో నయనతార కవ్విస్తోంది. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా చేసిన కొంతలో కొంతతోనే అభిమానులు మరియు నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు

By:  Tupaki Desk   |   11 Oct 2023 9:29 AM GMT
లేడీ సూపర్‌ స్టార్ కవర్ ఫోటోలతో కవ్వింపులు
X

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఒకప్పుడు సోషల్‌ మీడియాలో పెద్దగా కనిపించేది కాదు. ఆమె పర్సనల్‌ అకౌంట్స్ తో పాటు ఇతరులు కూడా ఆమె ఫోటోలు షేర్‌ చేసేందుకు వీలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు నయనతార ఫోటో షూట్స్ విషయంలో తన మనసు మార్చుకుని కుమ్మేస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి అందాల ఆరబోత హాట్‌ ఫోటో షూట్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి.


నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరో వైపు హీరోయిన్‌ గా కూడా సినిమాలు కంటిన్యూ చేస్తోంది. ఇక రెగ్యులర్‌ గా హాట్ ఫోటో షూట్స్ తో ఈ అమ్మడు తెగ రెచ్చి పోతుంది. తాజాగా ఎల్లి అనే మ్యాగజైన్ కోసం కవర్‌ పేజీ కి ఫోటో షూట్‌ ను ఇవ్వడం జరిగింది.


ఎల్లి ఫోటో షూట్ లో నయనతార కవ్విస్తోంది. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా చేసిన కొంతలో కొంతతోనే అభిమానులు మరియు నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ రేంజ్ లో నయనతార ను చూస్తామని అనుకోలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నయనతార లో ఈ మార్పు రావడం చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు.

ఇటీవలే హిందీ మూవీ జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి రికార్డులను బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు జోరు కంటిన్యూ చేస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతుంది. తెలుగు సినిమా లు ఈ మధ్య కాలంలో కమిట్ అవ్వని నయనతార ముందు ముందు ఏమైనా తెలుగు సినిమా లకు కమిట్ అయ్యేనా చూడాలి.