Begin typing your search above and press return to search.

చీర అందాలతో నేహా శెట్టి కవ్వింత

టాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో నేహాశెట్టి కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె తెలుగులో వరస సినిమాలు చేసుకుంటూ, దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   14 Sep 2023 5:53 AM GMT
చీర అందాలతో నేహా శెట్టి కవ్వింత
X

టాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో నేహాశెట్టి కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె తెలుగులో వరస సినిమాలు చేసుకుంటూ, దూసుకుపోతోంది. చిన్న హీరోలకు నేహా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. ఓ వైపు స్టార్ హీరోలతో శ్రీలీల అదరగొడుతోంటే, ఆ రేంజ్ లో యంగ్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటోంది. నేహా శెట్టి మెహబూబా సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టినా, డీజే టిల్లుతోనే ఫేమస్ అయిపోయింది. అందరూ ముద్దుగా ఆమెను రాధిక అని పిలుచుకుంటున్నారు.


రీసెంట్ గా నేహా శెట్టి బెదురులంకతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంటనే రూల్స్ రంజన్ తో మరోసారి ప్రేక్షకులకు ముందుకు రావడానికి రెడీ అయ్యింది. దీని తర్వాత వెంటనే, ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో రానుంది. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి.

చాలా మంది హీరోయిన్లు మోడ్రన్ దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. కానీ, నేహా మాత్రం చీరల్లోనే మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఆమెకు డ్రెస్ లు కంటే చీరల్లోనే ఎక్కువ అందంగా ఉంటుంది. అందుకే, ఎక్కువగా చీరల్లో ఫోటో షూట్ లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజా నేహా మరోసారి చీరల్లో మెరిసింది. . పసుపు రంగు చీరకు బ్లాక్ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసింది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ధరించింది. ముక్కుకు ముక్కెరపెట్టుకొని, ముఖాన బొట్టు పెట్టుకొని చాలా అందంగా ఉంది. ట్రెడిషన్ లుక్ లో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

ఇక, నేహా శెట్టి కి చిన్నతనం నుంచి నటి అవ్వాలనే కోరిక ఉండేదట. దాని కోసమే చాలా కష్టపడింది. న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమెకు కన్నడలో మొదటగా హీరోయిన్ అవకాశం వచ్చింది. ఆ తర్వాత తెలుగులో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీతో కలిసి మెహబూబా మూవీలో నటించింది.

అయితే, ఆ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులు పడినా, నేహాలోని గ్లామర్ యాంగిల్ మాత్రం డీజే టిల్లు మూవీలో బయటపడింది. ఆ మూవీ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. త్వరలోనే ఆమె మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది.