Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : చీకటి గదిలో చితక్కొట్టే అందం..!

'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి.

By:  Tupaki Desk   |   24 July 2024 3:30 PM GMT
పిక్‌ టాక్‌ : చీకటి గదిలో చితక్కొట్టే అందం..!
X

'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వచ్చిన గుర్తింపు ఎక్కువ. అలాగే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండటం వల్ల మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.


వెండితెరపైనే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా తన ప్రతిభను చూపించడం వల్ల నిక్కీ తంబోలీ గురించి ఇంకా కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.


తాజాగా ఆ విషయం నిజమే అన్నట్లుగా ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి ఫోటో షూట్‌ ఉంది. పింక్ డ్రెస్ లో సన్నని నాజూకైన నడుము అందం చూపిస్తూ కన్నుల విందు చేసిన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి కి మరోసారి వావ్‌ అంటూ అందరి నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ అమ్మడి ఫోటోలు అంతకు మించి అన్నట్లుగా ప్రతి సారి ఉంటున్నాయి. తాజాగా మరోసారి ఈ ఫోటోలతో నిక్కీ అదరగొట్టింది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న పాపం నిక్కీ కి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.