ఆమె జీవితం ఇక సింగిల్ గానేనా?
మరి ఆ నటి మళ్లీ పెళ్లి చేసుకోదా? జీవితాంతం సింగిల్ గానే ఉండిపోతుందా? అంటే ఆమె మాటల్ని బట్టి ఒంటరి జీవితాన్నే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 19 Dec 2023 11:52 AM GMTగాయాలు గుండెను మరింత బలంగా ధృడంగా మలుస్తాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎదుర్కునే శక్తి సామార్ధ్యాలు కూడగట్టుకుటుంది. అందుకే జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురైన తర్వాత మళ్లీ ఆ మార్గంలో ప్రయాణాన్ని పెద్దగా ఇష్టపడరు. అది ఎలాంటి ప్రయాణమైనా స్వేచ్ఛాయుత జీవితాన్ని కోరుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తాజాగా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ ఆ రకమైన జీవితాన్నే కోరుకుంటున్నట్లు ఆమె మాటల్ని బట్టి తెలుస్తుంది.
ఆ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో మరో స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కాపురం అనంతరం కలతలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. ప్రస్తుతం ఎవరి గమ్యం వారిది. వృత్తిగత జీవితంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. మరి ఆ నటి మళ్లీ పెళ్లి చేసుకోదా? జీవితాంతం సింగిల్ గానే ఉండిపోతుందా? అంటే ఆమె మాటల్ని బట్టి ఒంటరి జీవితాన్నే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవలే ఆ నటి పెళ్లి గురించి ఓ పెద్ద లెక్చర్ ఇచ్చింది. భారతదేశం లోనూ..ప్రపంచంలోనూ విడాకుల గణాంకలను సైతం బట్టబయలు చేసింది. విడిపోయిన వారి వయసులు..ఏడాదిలో విడాకుల రేటు ఎలా ఉంది? మొదటిసారి పెళ్లి చేసుకుని విడిపోయిన వారు ఎంత మంది? రెండవ సారి పెళ్లి చేసుకుని మళ్లీ విడాకులు తీసుకున్న జంటలెన్ని? అలాగే మూవసారి పెళ్లి చేసుకుని విడిపోయిన వారి జాబితా? ఇలా మూడు రకాల జాబితాను పబ్లిక్ లో పెట్టి జీవితానికి పెళ్లి అవసరమా? అని ఆలోచించేలా చేసింది.
వాస్తవానికి భారతదేశంలో విడాకుల శాతం బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థ విఛ్చినం అవుతుందని సర్వేలు సైతం చెబుతున్నాయి. ఇప్పటి యువత పెళ్లి అంటే పెద్దగా ఆసక్తి చూపించలేదని సర్వేలు చెబుతున్నాయి. మరి ఇవన్నీ నిశితంగా పరిశీలించి సదరు నటి ఇక జీవితంలో పెళ్లి వద్దు..సింగిల్ గానే జీవితాన్ని ముగించాలనుకుంటుందో ఏమో! అన్న సందేహం రాకమానదు.