పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్ బోల్డ్ ఫోటోషూట్
సంసారంలోకి అడుగుపెట్టాక ఇంత హాట్ గా మారిందేమిటీ? అంటూ ఒకటే గుసగుసలు ఎక్కువయ్యాయ్
By: Tupaki Desk | 11 May 2024 3:35 AM GMTపెళ్లికి ముందు అధిక బరువు విషయంలో విమర్శల్ని ఎదుర్కొంది సదరు నటి. కానీ యోగా, ఫిట్నెస్ పాఠాలతో చాలా వరకూ బరువు తగ్గి, కెరీర్ ని ముందుకు నడిపించింది. ఒకానొక దశలో నెలకు 4లక్షల చొప్పున ఖర్చు చేసి ఫిట్నెస్ గురువు సమక్షంలో బరువు తగ్గాలని తనకు కొందరు సూచించినట్టు తెలిపింది. కానీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నానని ఆవేదన చెందింది. అదంతా అటుంచితే ఇప్పుడు పెళ్లి తర్వాత ఈ భామ గ్లామ్ లుక్ చూసి యూత్ ఒకటే ఫిదా అయిపోతున్నారు. సంసారంలోకి అడుగుపెట్టాక ఇంత హాట్ గా మారిందేమిటీ? అంటూ ఒకటే గుసగుసలు ఎక్కువయ్యాయ్..
ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ట్యాలెంటెడ్ నటి ఎవరు? అంటే.. ది గ్రేట్ పరిణీతి చోప్రా. ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాను పెళ్లాడిన పరిణీతి పెళ్లి తర్వాతా నటనలో బిజీ అవుతోంది. మరోవైపు వరుస ఫోటోషూట్లతోను హీటెక్కిస్తోంది. తాజాగా పాపులర్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబు రత్నానీ కెమెరాకు ఫోజులిచ్చింది. పారీ ఆల్మోస్ట్ అర్థనగ్నంగా ఫోజులిచ్చింది. కేవలం తన దేహశిరులను ఒక ముఖమల్ క్లాత్ తో కవర్ చేసింది. తుప్పు పట్టిన కార్ లో డబు రత్నానీ మార్క్ ఫోటోషూట్ ఇది. పారీ ఈ లుక్ లో చాలా స్పెషల్ గా హాట్ గా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది.
డబూరత్నానీ క్యాలెండర్ కోసం అప్రయత్నంగా బోల్డ్ గా నిస్సందేహంగా పరిణీతి!... అంటూ దీనిని ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేసారు. డబు రత్నానీ స్టూడియోలో ఈ ఫోటోషూట్ జరిగింది. సంజనా బాత్రా, మరియానా స్టైలింగ్, మేకప్ కోసం పని చేసారు. పరిణీతి ఈ స్పెషల్ లుక్ నిజంగా యూనిక్ అనడంలో సందేహం లేదు.
4లక్షలు చెల్లించలేని స్థితి నుంచి ..
ఇటీవలే దిల్జిత్ దోసాంజ్ 'అమర్ సింగ్ చమ్కిలా' చిత్రంలో అమర్‌జోత్ కౌర్ పాత్రలో పరిణీతి చోప్రా తన నటనతో మైమరిపించింది. సక్సెస్ సమావేశాల్లో పారీ తన అధిక బరువుతో ఎలాంటి ఇబ్బందులకు గురైందో వెల్లడించింది. తనను చాలా మంది ఎగతాళి చేసారని పారీ అంది. ఒక ట్రైనర్‌ని నియమించుకుని, పోషకాహార నిపుణుడిని ఎంపిక చేసుకుని నెలకు రూ.4 లక్షలు ఖర్చు చేస్తేనే బరువు తగ్గుతావని ఎవరో తనకు సూచించారట. రాజ్ షమణితో పోడ్‌కాస్ట్ సందర్భంగా పారీ మాట్లాడుతూ..తన కెరీర్ ప్రారంభంలో పెద్దగా సంపాదించలేకపోవడంతో తాను అలా చేయలేకపోయానని వెల్లడించింది.
అంతగా ఆదాయం లేని సమయంలో నెలకు 4 లక్షలు నాదగ్గర ఎలా వస్తాయి? నేను అంత డబ్బు సంపాదించలేను. నా మూడో సినిమాలో నటిస్తున్న సమయంలో సహచరుడు ఒక సలహా ఇచ్చాడు. వ్యక్తిగత శిక్షకులు అవసరమని చెప్పాడు. కానీ నేను ఆ ఖర్చుల్ని భరించలేనని చెప్పాను. నా మొదటి చిత్రానికి 5 లక్షలు ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తం తేలేని పరిస్థితి. ఒకవేళ ఆర్థిక స్థోమత లేకపోతే, మీరు ఈ వృత్తిలో ఉండకూడదు అని అతడు సలహా ఇచ్చాడని పరిణీతి తెలిపింది. పంజాబ్ పాప్ స్టార్ బయోపిక్ 'అమర్ సింగ్ చమ్కిలా'లో చమ్కిలా భార్య పాత్రలో పరిణీతి నటించింది. సినిమా ప్రేక్షకులకు నచ్చింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.