Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ పెంచుతున్నా అదే బ్యాడ్ లక్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:20 AM GMT
గ్లామర్ డోస్ పెంచుతున్నా అదే బ్యాడ్ లక్
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్ చైర్ లోకి వచ్చిన ఈ బ్యూటీకి గతకొంతకాలంగా అస్సలు కలిసిరావడం లేదని చెప్పాలి. గత ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పూజా హెగ్డే కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.


ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మూవీ ఊహించని విధంగా చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆతరువాత సల్మాన్ ఖాన్ కి జోడీగా చేసిన కిసీకి జాన్ కిసీకా భాయ్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ని హిందీలో ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాతో చేసిన వర్క్ అవుట్ కాలేదు. ఇలా రెండు పెద్ద డిజాస్టర్స్ రెండు ఇండస్ట్రీలలో వచ్చాయి.

తరువాత ఏమైందో ఏమో కానీ గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర నుంచి పూజా హెగ్డేని తొలగించారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజాని పక్కన పెట్టారు. ఈ రెండు చిత్రాలలో ఆమె క్యారెక్టర్ కోసం శ్రీలీల తీసుకున్నారు. విజయ్, పరశురామ్ సినిమాలో ఫైనల్ వరకు పూజా హెగ్డే పేరు వినిపించింది. సడెన్ గా మృణాల్ ఠాకూర్ ఆ ప్లేస్ లోకి వచ్చింది.

రవితేజతో ఒక సినిమా డిస్కషన్ జరుగుతున్నాయని టాక్ వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. ఇలా చేతి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పోతున్నాయి. డేట్స్ అడ్జస్ట్ చేయలేక అనే రూమర్ వినిపించిన అందులో వాస్తవం ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఓ విధంగా ఈ ఏడాది మొత్తం పూజా హెగ్డేని బ్యాడ్ లక్ వెంటాడుతుంది.

అయితే చేతిలో సినిమాలు లేకపోయిన అమ్మడు ఫోటోషూట్ లకి మాత్రం కొదవ ఉండటం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాలని బందీ చేసే ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదం అందిస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సన్ బ్లూస్ అంటూ వైట్ కలర్ కాస్ట్యూమ్స్ లో సముద్ర తీరంలో అప్పుడే ఒడ్డుకు కొట్టుకొచ్చిన అందాల జలకన్యల దేహపు అందాలతో కుర్రకారు గుండెల్లో తుఫాన్ సృష్టిస్తోంది. ఈ వీడియోని 4 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.