పండగ ముందు ఆ ఫోజులేంటి పూజా?
సౌత్ నార్త్ లో భారీ చిత్రాలలో నటించిన పూజా హెగ్డే అరుదైన ఫ్యాషనిస్టాగాను గౌరవం అందుకుంటోంది
By: Tupaki Desk | 11 Nov 2023 4:42 PM GMTసౌత్ నార్త్ లో భారీ చిత్రాలలో నటించిన పూజా హెగ్డే అరుదైన ఫ్యాషనిస్టాగాను గౌరవం అందుకుంటోంది. ఇంతకుముందు దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని చీరలో కిల్లింగ్ లుక్‌తో కనిపించింది. ఇంతలోనే ఇప్పటికిప్పుడు గెటప్ మార్చి సరికొత్తగా కనిపిస్తోంది.
తాజా లుక్ లో పూజా పూర్తిగా వెస్ట్రన్ ఔట్ ఫిట్ లో కనిపించింది. అది కూడా బ్లాక్ కలర్ బ్లేజర్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఇక పూజా ఈ ప్రత్యేకమైన లుక్ కోసం డిజైనర్ టీషర్ట్ ని ఎంపిక చేసుకుంది. దానిపై బ్లేజర్ లో ట్రెండీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. అయితే పూజా ఫోటోగ్రాఫ్స్ కోసం రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. తనని ఇలా చూడగానే, దీపావళి పండగ పూట ఏంటిది పూజా? అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు యూత్. ఈవిడేమైనా మీర్జాపూర్ మహారాణి అనుకుంటుందా? అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు.
వృత్తిరీత్యా చూస్తే, పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో కనిపించింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో 'దేవా' థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తోంది. జెర్సీ నటుడు షాహిద్ కపూర్‌తోను ఓ చిత్రంలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ రాయ్ కపూర్ బ్యానర్ తో పాటు జీ స్టూడియోస్ మద్దతునిస్తోంది. ఈ చిత్రం 11 అక్టోబర్ 2024న విడుదల కానుంది. తాజా గుసగుసల ప్రకారం.. దేవా కథ ఒక అసాధారణమైన పోలీసు అధికారి ఉన్నత స్థాయి కేసును ఛేదించడానికి ప్రయత్నించే క్రమంలో ఏం జరిగింది? అన్నదే సినిమా.